సుక్కుతో పక్కా అంటున్నారే..

Sun Jan 14 2018 13:45:03 GMT+0530 (IST)

కొన్ని సినిమాలు ఫ్లాప్ అయినా క్లాసిక్ స్టేటస్ అందుకుంటాయి. మరపురాని సినిమాలుగా నిలిచిపోతాయి. మహేష్ బాబు కెరీర్లో ‘1 నేనొక్కడినే’ సినిమా అలాంటిదే. సుకుమార్ దర్శకత్వంలో మహేష్ నటించిన ఈ సినిమా రకరకాల కారణాల వల్ల అనుకున్న స్థాయిలో ఆడలేదు. మహేష్ కెరీర్లో పెద్ద డిజాస్టర్లలో ఒకటిగా నిలిచింది. ఐతే సినిమా రిలీజైన కొన్నాళ్లకు కానీ ఈ సినిమా గొప్పదనమేంటో జనాలకు అర్థం కాలేదు. తర్వాత తర్వాత దీన్ని ఒక క్లాసిక్ గా గుర్తించడం మొదలుపెట్టారు జనాలు. ‘1 నేనొక్కడినే’ ఫలితం ఎలా ఉన్నప్పటికీ తాను సుకుమార్ తో మళ్లీ సినిమా చేస్తానని అప్పట్లో అన్నాడు మహేష్. ఇప్పుడు నిజంగానే ఈ కాంబినేషన్ రిపీట్ కాబోతున్నట్లు వార్తలొస్తున్నాయి.మళ్లీ మహేష్-సుక్కు కాంబోలో సినిమా అంటూ కొన్ని నెలల ముందు నుంచే చర్చ నడుస్తోంది. ఇప్పుడు ఆ దిశగా అడుగులు పడ్డట్లు సమాచారం. ప్రస్తుతం ‘రంగస్థలం’ పూర్తి చేసే పనిలో ఉన్న సుక్కు.. ఈ మధ్యే మహేష్ ను కలిసి కథ చెప్పాడని.. ప్రిన్స్ కూడా సానుకూలంగా స్పందించాడని.. పూర్తి స్క్రిప్టుతో రమ్మన్నాడని తెలుస్తోంది. ‘1 నేనొక్కడినే’ సినిమాను నిర్మించిన 14 రీల్స్ వాళ్లే ఈ సినిమాను కూడా నిర్మిస్తారట. ‘రంగస్థలం’ పని ముగించాక సుకుమార్ కొన్ని నెలల పాటు ఈ స్క్రిప్టుపై కూర్చుని మళ్లీ మహేష్ ను కలుస్తాడట. త్వరలోనే ఈ ప్రాజెక్టు గురించి అధికారిక సమాచారం బయటికి రావచ్చని తెలుస్తోంది. ‘రంగస్థలం’ తర్వాత సుకుమార్ మరే సినిమా కమిట్ కాని సంగతి తెలిసిందే. మహేష్ మాత్రం వంశీ పైడిపల్లి సినిమా తర్వాత రెండు మూడు సినిమాలకు కమిట్మెంట్ ఇచ్చి ఉన్నాడు కానీ.. ఏదీ పక్కాగా ఓకే కాలేదు.