Begin typing your search above and press return to search.

త్రివిక్రమ్ ని ఫాలో అవుతున్న సుకుమార్

By:  Tupaki Desk   |   29 March 2020 3:00 PM GMT
త్రివిక్రమ్ ని ఫాలో అవుతున్న సుకుమార్
X
ప్రస్తుతం టాలీవుడ్ లో దర్శకులలో త్రివిక్రమ్ - సుకుమార్ ముందు వరసలో ఉంటారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ సంక్రాంతికి వచ్చిన 'అల వైకుంఠపురంలో' మూవీతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఇక సుకుమార్ విషయానికొస్తే గత ఏడాది 'రంగస్థలం' లాంటి బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకొని ప్రస్తుతం అల్లు అర్జున్ తో సినిమా తెరకెక్కిస్తున్నాడు. డైరెక్టర్లుగా కెరీర్ స్టార్ట్ చేసినప్పటి నుండి వీరిద్దరూ చెరో దారిలో వెళ్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు సుకుమార్ సడన్ గా రూటు మార్చి త్రివిక్రమ్ ని ఫాలో అవుతున్నాడట.

వివరాల్లోకి వెళ్తే సుకుమార్ తన సినిమా టైటిల్ విషయంలో గురూజీ దారిలో నడుస్తున్నాడు. త్రివిక్రమ్ తన మొదటి సినిమా నుండి సాఫ్ట్ టైటిళ్లతో - లేడీ నేమ్ తో స్టార్ట్ అయ్యే టైటిళ్లతో సినిమాలు తీస్తున్నాడు. నువ్వే నువ్వే - అరవింద సమేత - అ ఆ (అనసూయ రామలింగం vs ఆనంద్ విహారి) సినిమా టైటిళ్లను చూస్తే ఈ విషయం అర్థం అవుతుంది. మరోవైపు సుకుమార్ ఫస్ట్ సినిమా నుండి డిఫరెంట్ టైటిళ్లతో వస్తున్నాడు. కానీ ఇప్పుడు సుకుమార్ తన నెక్స్ట్ సినిమా కోసం రూట్ మార్చి కోసం త్రివిక్రమ్ తరహా టైటిల్ పెట్టాలని ఆలోచిస్తున్నాడట. అందులోనూ బన్నీ తో తీయబోయే సినిమా కోసం లేడీ ఓరియెంటెడ్ నేమ్ పెట్టాలని అనుకుంటున్నాడట. దీని కోసం ఇప్పటికే చాలా టైటిళ్లను రెడీ చేసుకొని - వాటిలో బెస్ట్ నేమ్ ఫైనలైజ్ చేసే పనిలో పడ్డాడని సమాచారం. దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ఎత్తేసిన వెంటనే సుకుమార్ అండ్ టీమ్ ఈ టైటిల్ ను అనౌన్స్ చేయాలని భావిస్తున్నారట. ఇదిలా ఉండగా సుక్కు దర్శకత్వం వహించబోయే చిత్రంలో హీరోయిన్ గా రష్మిక నటిస్తుండగా - మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. సుకుమార్ ఆస్థాన సంగీత దర్శకుడు దేవిశ్రీ సంగీతాన్ని అందించనున్నారు.