Begin typing your search above and press return to search.

సుక్కు శిష్యుడితో సిద్ధు జొన్నలగడ్డ సినిమా!

By:  Tupaki Desk   |   7 Feb 2023 11:47 AM GMT
సుక్కు శిష్యుడితో సిద్ధు జొన్నలగడ్డ సినిమా!
X
'గుంటూరు టాకీస్‌', 'కృష్ణ అండ్‌ హిజ్‌ లీలా', 'డీజే టిల్లు' లాంటి చిత్రాలతో ప్రేక్షకుల్ని మెప్పించిన హీరో జొన్నలగడ్డ. ఇప్పుడు వినోదాలు పంచేందుకు సిద్ధమయ్యారు. గుంటూరు టాకీస్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఈ యంగ్ టాలెంట్ హీరో.. మొదటి సినిమాతోనే నటన పరంగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. రీసెంట్గా డీజే టిల్లు సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్నాడు. మంచి అంచనాలు మధ్య విడులైన ఈ చిత్రం సూపర్ హిట్గా నిలిచింది. ఈ సినిమాతో సిద్ధు ఒక్కసారిగా భారీ క్రేజ్ను సొంతం చేసుకున్నాడు.

ఇక ఈ కుర్ర హీరో నటనతో పాటు ఆటిట్యూడ్కు యూత్ అంతా ఫిదా అయ్యారు. అయితే ఈ చిత్ర విజయంతో అతడితో సినిమా చేసేందుకు కుర్ర దర్శకులంతా క్యూ కడుతున్నారని తెలిసింది. కానీ ఇప్పుడు వరకు అతడు కొత్త సినిమాను ప్రకటించలేదు. ఇంకా కథలు వింటూనే డీజే టిల్లు సీక్వెల్ను పట్టాలెక్కించే పనిలో బిజీగా ఉన్నాడు.

కెరీర్ మొదటి నుంచి విభిన్నమైన కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్న సిద్ధు ఇప్పుడు కూడా అదే తరహా కథలను ఎంచుకోవాలని చూస్తున్నాడట. అందుకే ఈ ఆలస్యం అవుతుందని తెలుస్తోంది.

అయితే అతడి సినిమాల గురించి ఇప్పుడు ఓ కొత్త విషయం బయటకు వచ్చింది. అదేంటంటే.. ఇండస్ట్రీలో దర్శకుడు సుకుమార్ దగ్గర పని చేసే అసిస్టెంట్ డైరెక్టర్స్ అంతా బయటకు వచ్చిన దర్శకులుగా మారుతున్న సంగతి తెలిసిందే. వారందరినీ సుక్కునే ప్రోత్సాహిస్తూ కెరీర్లో ముందుకెళ్లేలా తోడుగా ఉంటున్నారు.

తన కథలనే వారిచేత సినిమాలు కూడా తీయిస్తున్నారు. తన సుకుమార్ రైటింగ్స్ బ్యానర్పై కూడా సినిమాలను నిర్మిస్తున్నారు. అలా తాజాగా సుక్కూ స్కూలు నుంచి మరో కొత్త దర్శకుడు రాబోతున్నారని తెలుస్తోంది. ఇప్పుడా కొత్త దర్శకుడితో సిద్ధు జొన్నలగడ్డ సినిమా ఉంటుందని ప్రచారం సాగుతోంది. ఇది కూడా సుకుమార్ రైటింగ్స్పైనే ఎస్వీసీసీతో రూపొందబోతుందని తెలుస్తోంది త్వరలోనే అధికార ప్రకటన వచ్చే అవకాశముంది.

ఇక డీజే టిల్లు విషయానికొస్తే.. 2022లో ప్రేక్షకుల ముందుకొచ్చి, మంచి విజయం అందుకుందీ చిత్రం. డీజే టిల్లు. ఈ సినిమాకి కొనసాగింపుగా టిల్లు స్వ్కేర్‌ రాబోతుంది. కథానాయికగా అనుపమ పరమేశ్వరన్‌ నటిస్తోంది. 'డిజే టిల్లు'కు విమల్‌ కృష్ణ దర్శకత్వం వహించగా దాని సీక్వెల్‌ను రామ్‌ మల్లిక్‌ డైరెక్ట్‌ చేస్తున్నారు. సూర్య దేవర నాగవంశీ నిర్మాత. తొలి భాగంలోని హీరో పాత్ర టిల్లు, హీరోయిన్‌ పాత్ర రాధిక (నేహాశెట్టి ) యువతను కట్టిపడేశాయి. దాంతో, ఈ సినిమా ప్రకటన రాగానే ఆడియన్స్‌లో ఆసక్తి మొదలైంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.