నన్ను ఇలా చూడండి! అంటూ కవ్వించిన స్టార్ డాటర్!!

Thu Nov 26 2020 15:20:40 GMT+0530 (IST)

Look at me like this! Star Daughter who was so excited !!

అంతా సవ్యంగా జరిగి ఉంటే ఈపాటికే కింగ్ ఖాన్ షారూక్ వారసురాలు హీరోయిన్ అయ్యి ఉండేదే. కరోనా మహమ్మారీ ఎన్నో ప్లాన్స్ కి అర్థాంతరంగా చెక్ పెట్టేసింది. ఏడాది విలువైన కాలాన్ని హరించి వేసింది. సుహానా తొందర్లోనే కథానాయికగా పరిచయం అవుతుందని కింగ్ ఖాన్ షారూక్ ప్రకటించినా ఇంకా ఆ అంకం మొదలు కానే లేదు.ప్రస్తుతానికి బాద్షా కుమార్తె .. సుహానా ఖాన్ సోషల్ మీడియా చాటింగులతో సరిపుచ్చుతోంది. 20 ఏళ్ల ఈ కుర్ర బ్యూటీ తన అభిమానులకు స్నేహితులకు ఇన్ స్టా వేదికగా నిరంతరం తన లేటెస్టు ఫోటోషూట్లను షేర్ చేస్తోంది. అలాగే భారీగా ఫాలోవర్స్ ని సంపాదించుకుంది. పలు ఫోటోషూట్లలో సుహా లుక్స్ పరంగా ప్రయోగాలు చేస్తోంది.

ఇటీవల ఓ ప్రింటెడ్ క్రాప్-టాప్ డ్రెస్ ధరించి ఆ ఫోటోల్ని షేర్ చేయగా వైరల్ అయ్యాయి. పొడవాటి స్లీవ్ పూల క్రాప్ టాప్ ఆకర్షణీయంగా కుదిరింది. కాంబినేషన్ గా తెల్లని స్కర్ట్ తో టై-అప్ ఫీచర్ ను ధరించింది. “చూడండి! నన్ను లంగా లో! ” అంటూ క్యాప్షన్ ఇచ్చింది సుహానా.

సుహానా పోస్ట్ పై అపరిమితంగా ఆమె స్నేహితులు చాలా మంది ఆమెను పొగడ్తలతో ముంచెత్తారు. చాలా అందమైన సు అని ఒకరు ..ఓకేయ్ బోహేమియన్ యువరాణ... అని మరొకరు వ్యాఖ్యానించారు. లవ్ యు అండ్ లంగా అని వేరొకరు ప్రేమను కురిపించారు.

ఇటీవల ఇండియన్ ప్రీమియర్ లీగ్ కోసం సుహానా ఆమె కుటుంబం - షారుఖ్ ఖాన్- గౌరీ ఖాన్- ఆర్యన్ - అబ్రామ్ సెప్టెంబర్ నుండి దుబాయ్ లో ఉన్నారు. ఈ నెల మొదట్లో ముంబైకి తిరిగి వచ్చారు. అభిమానుల ఆనందానికి సుహానా దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫాలో షారుఖ్ పుట్టినరోజు వేడుకల చిత్రాలతో సహా వారి పర్యటన నుండి ప్రతి అప్ డేట్ ని అందించారు.