బాలీవుడ్ స్టార్ మేకర్ గా కరణ్ జోహార్ కు పేరు ఉంది. ఇప్పటి వరకు ఎంతో మంది కొత్త వారిని ఇండస్ట్రీ కి పరిచయం చేసిన ఘనత కరణ్ జోహార్ కు దక్కుతుంది. శ్రీదేవి కూతురు జాహ్నవి కపూర్ నుండి మొన్నటి అనన్య పాండే వరకు అంతకు ముందు కూడా కరణ్ జోహార్ హీరోలను హీరోయిన్స్ ను పరిచయం చేసిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఈయన చేతిలో మరో కొత్త అమ్మాయి వచ్చింది. ఆమె మరెవ్వరో కాదు బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ కూతురు సుహానా ఖాన్.
గత
సంవత్సరం నుండి కూడా సుహానా ఖాన్ హీరోయిన్ గా పరిచయం కాబోతున్నట్లుగా
మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఆ వార్తలు నిజం అయ్యే టైం వచ్చింది. ఈ
ఏడాది లో కరణ్ జోహార్ బ్యానర్ లో సుహానా హీరోయిన్ గా పరిచయం కాబోతుంది.
అందుకోసం స్క్రిప్ట్ ను కూడా సిద్దం చేయిస్తున్నాడు. స్టూడెంట్ ఆఫ్ ది
ఇయర్ 3 చిత్రంతో సుహానా ఖాన్ ను హీరోయిన్ గా పరిచయం చేయాలని షారుఖ్
మరియు కరణ్ జోహార్ లు నిర్ణయించుకున్నారు.
సుహానా ఖాన్ హీరోయిన్
గా నటించబోతున్న ఆ సినిమాలో బిగ్ బాస్ సీజన్ 13 రన్నర్ ఆసిమ్ రియాజ్
ను హీరోగా నటింపజేస్తున్నారు. గతంలో కొన్ని సినిమాల్లో నటించినా కూడా
ఆసిమ్ కు పెద్దగా గుర్తింపు రాలేదు. కాని బిగ్ బాస్ సీజన్ 13 వల్ల ఈయన
క్రేజ్ అమాంతం పెరిగింది. అందుకే సుహానా ఖాన్ మొదటి సినిమాలో ఈయన్ను
ఎంపిక చేయాలని నిర్ణయించుకున్నట్లుగా సమాచారం అందుతోంది. అతి త్వరలోనే ఈ
విషయమై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు
ఈ సినిమా తీసుకు వచ్చే ఆలోచనలో షారుఖ్ అండ్ కరణ్ లు ఉన్నారు.