Begin typing your search above and press return to search.

కెమెరామెన్ లు వెంబ‌డిస్తుంటే ఉలిక్కిప‌డుతోంద‌ట‌!

By:  Tupaki Desk   |   25 Jun 2022 2:30 AM GMT
కెమెరామెన్ లు వెంబ‌డిస్తుంటే ఉలిక్కిప‌డుతోంద‌ట‌!
X
బాద్ షా షారూఖ్ ఖాన్ గారాల‌ కుమార్తె సుహానా ఖాన్ బాలీవుడ్ లో అడుగుపెడుతున్న సంగ‌తి తెలిసిందే. ఇప్పటికే సుహానా మెరుపులు క‌ల్లోలం సృష్టిస్తున్నాయి. ఈ గ్లామర్ క్వీన్ కి 22 ఏళ్లు. అందుకు త‌గ్గ‌ట్టే టీన్స్ లో బోలెడంత ఫాలోయింగ్ సంపాదించింది. సుహానా అంటే ప‌డి చచ్చే వాళ్లున్నారు. ఈ భామ‌ ఎక్క‌డికి వెళ్లినా కెమెరా క‌ళ్లు వెంటాడుతున్నాయి. కానీ ఇంకా దీనికి ఈ క్యూటీ అల‌వాటు ప‌డ‌లేద‌నేది తాజా గుస‌గుస‌. జ‌నం వెంబ‌డిస్తుంటే ఎంతో గంద‌ర‌గోళానికి గుర‌వుతోంద‌ట‌.

అంతేకాదు.. షారుఖ్ ఖాన్ కూతురు సుహానా ఖాన్ కి ట్రోలింగ్ బెడ‌ద కూడా ఎక్కువే. గ‌ల్లీ బోయ్స్ ఫేం జోయా అక్తర్ దర్శకత్వం వహిస్తున్న `ది ఆర్చీస్` చిత్రంతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టనుంది. త‌న‌ అరంగేట్రం ఇప్పటికీ పరిశ్రమ కు గ్లామర్ అద్దుతోంది.

అంతేకాదు ముంబై ఫోటోగ్రాఫ‌ర్లు త‌న వెంట ప‌డి మ‌రీ ఫోటోగ్రాఫ్స్ కోసం త‌న‌ను బ‌తిమాలుతున్నారు. అయితే సుహానా తాజాగా ఫోటోగ్రాఫ‌ర్ల‌ను అవాయిడ్ చేసింద‌ట‌. దీంతో ఆటోమెటిగ్గా ట్రోలింగ్ పెరిగింది. అంతేకాదు త‌న చుట్టూ ఫోటోగ్రాఫ‌ర్ల స‌మూహం గుమికూడడాన్ని చూసి సుహానా ఉలిక్కిపడుతోందిట‌. అంతేకాదు కెమెరామెన్ ల పిలుస్తున్నా ఎక్కువ శ్రద్ధ చూపకుండా సుహానా తప్పించుకుందిట‌. దీంతో నెటిజన్లు ఆమెపై సీరియ‌స్ అయ్యారు అంటూ ప్ర‌చారం మొద‌లైంది.

సుహానా ప్ర‌స్తుతం తన డ్యాన్స్ రిహార్సల్స్ కోసం చాలా శ్ర‌మిస్తోంది. కానీ కెమెరామెన్ ల కంట ప‌డ‌కుండా దాగుడుమూతలు ఆడుతోంద‌ట‌. సుహానా ఏం చేసినా వెంబ‌డించి మ‌రీ ఫోటోగ్రాఫ‌ర్లు ఈ స్టార్ కిడ్ ఫోటోలను క్లిక్ చేస్తున్నారు. దాంతో హడావిడిగా వెళ్లిపోతోంద‌ట‌. తాజా ఇన్సిడెంట్ లో ఫోటోలకు పోజులివ్వకుండా భవనంలోపలికి దూసుకుపోయింది! అంటూ ఫోటోగ్రాఫ‌ర్లు ఆవేద‌న చెందుతున్నారు.

అయితే సుహానా ఇంకా ఫోటోగ్రాఫ‌ర్ల ఝంజాటాన్ని అల‌వాటు ప‌డ‌లేద‌ని ముంబై ఫోటోగ్రాఫ‌ర్లు చెప్ప‌క‌నే చెబుతున్నారు. ఫోటోగ్రాఫ‌ర్ల‌తో నిరంత‌రం ఎన్ కౌంటర్ లను ఎదుర్కొంటోంది. త‌ను ఇంకా ఈ గ్లిజ్ అండ్ గ్లామ‌ర్ ప్ర‌పంచ‌పు గందరగోళానికి అలవాటు పడటానికి కొంచెం సమయం పడుతుందని చెబుతున్నారు.

ది ఆర్చీస్ పాపుల‌ర్ కామిక్ సిరీస్ నుండి సంగ్ర‌హించిన క‌థాంశం. 1960ల నేప‌థ్యంలో క‌థాంశం సాగుతుంది. ఇది ఒక మ్యూజిక‌ల్ డ్రామా. నెట్ ఫ్లిక్స్ లో సిరీస్ రూపంలో ప్రదర్శిత‌మ‌వుతోంది.