Begin typing your search above and press return to search.

#shock షారుఖ్ డాట‌ర్‌ కి కోప‌మొచ్చిందా?

By:  Tupaki Desk   |   25 Sep 2020 5:37 PM GMT
#shock షారుఖ్ డాట‌ర్‌ కి కోప‌మొచ్చిందా?
X
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అనుమానాస్ప‌ద మృతిని డ్ర‌గ్స్ కోణంలోనూ విచారిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో రియా వాట్సాప్ చాట్ ద్వారా బాలీవుడ్ హీరోయిన్స్ దీపికా ప‌దుకునే . సారా అలీఖాన్ ...‌, శ్ర‌ద్ధా క‌పూర్‌ ల‌తో పాటు ర‌కుల్ కు కూడా ఎన్సీబీ అధికారులు విచార‌ణ‌కు హాజ‌రు కావాల్సిందే అంటూ స‌మ‌న్లు జారీ చేసిన విష‌యం తెలిసిందే. ఈ శుక్ర‌వారం ర‌కుల్ ముంబైలోని ఎన్సీబీ గెస్ట్ హౌస్‌ లో విచార‌ణ‌కు హాజ‌రైంది.

ఈ సంద‌ర్భంగా బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ గారాల ప‌ట్టి సుహాన ఖాన్ ఇన్ స్టాలో షేర్ చేసిన పోస్ట్ ఆ‌స‌క్తిక‌రంగా మారింది. మ‌హిళ‌ల మ‌నోభావాల్ని కించ‌ప‌రిచే విధంగా జ‌రుగుతున్న చ‌ర్య‌ల్ని కండిస్తూ నిగూఢ అర్థాల్నిచ్చే సందేశాల‌ని సుహాన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. క‌రోనా కార‌ణంగా తండ్రితో క‌లిసి హోమ్ క్వారెంటైన్‌ లో వుంటున్న ఇన్ స్టాలో ఆస‌క్తిక‌ర పోస్ట్ ని పెట్ట‌డం ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది. బాలీవుడ్ డ్ర‌గ్స్ వివాదంపై ఓ నెటిజ‌న్ చేసిన కామెంట్ కు ప్ర‌తిగా సుహ‌న స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇచ్చింది.

`‌మ‌హిళ‌ల ప‌ట్ల కొంత మంది ద్వేషాన్ని వెల్ల‌గ‌క్కుతూ త‌మ స‌మ‌యాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. స్త్రీలను ద్వేషిస్తున్న‌ప్పుడు మీరు స్పృహతో ఆలోచించాల్సిన అవసరం లేదు . కాని స్త్రీ ఏదో ఒక పని చేసినప్పుడు అది పురుషుడి చేత చేయబడినదానికంటే ఎక్కువ ప్రేరేపించబడిందని మీకు మీరే ప్రశ్నించుకోండి. ` అని షేర్ చేసింది.