తుఫాన్ ముందు నిశ్శబ్ధంలా స్టార్ డాటర్ లో మదనం

Tue Sep 14 2021 05:00:02 GMT+0530 (IST)

Suhana Khan Latest Photo

బాలీవుడ్ బాద్ షా షారుక్  ఖాన్ ముద్దుల కుమార్తె సుహానా ఖాన్ క్రేజ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. స్టార్ కిడ్ బాలీవుడ్ కి ఎంట్రీ ఇవ్వక ముందే ఉత్తరాది ప్రేక్షకుల్ని అందచందాలతో  ఊపేస్తోంది. ఇప్పటికే ఇన్ స్టాలో భారీగా పాలోవర్స్ ని కలిగి ఉంది. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫోటోల్ని అప్ లోడ్ చేస్తూ మంటలు రేపుతోంది. స్టార్ కిడ్ ప్రొఫెషన్ ఫోటోలు కాకుండానే ఓ రేంజ్ లో ఐడెంటీని చాటుకుంటోంది. ఇక రియల్ గా ముఖానికి మేకప్ వేసి దిగితే సీన్ ఎలా ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. తాజాగా అమ్మడు ఈ సండేని న్యూయార్క్ లో ఎంజాయ్ చేసింది. విదేశీ ట్రిప్ లో భాగంగా ఫారిన్ చెక్కేసింది. అక్కడ సండే పూట ఇలా మండే ఎండలో సెగలు రేపింది.తెల్లటి షర్ట్.. ఇన్నర్ లో బ్లాక్ బనియన్.. డెనిమి ఫ్యాంట్ ధరించింది. కాళ్లకు నల్లటి క్యాజువల్ షూట్ వేసింది. ఈ వస్త్రాల్లో సుహానా థై అందాల్ని ఎలివేట్ చేసింది. చుట్టూ పచ్చిన చెట్లు... తోరణాలు నడుమ సుహానా కురులు ఆరబోసి అలా ఫోజులిచ్చేసరికి యువతరం ఫిదా అయిపోతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో ఇన్ స్టాలో వైరల్ అవుతోంది. బాద్ షా ఫ్యాన్స్ తమ ఫేవరెట్ డాటర్ పై హాట్ కామెంట్లతో చీర్ చేస్తున్నారు. సుహానా ఇప్పటికే  రెండు షార్ట్ ఫిల్మ్ ల్లో నటించింది.  బాలీవుడ్ మేకర్ జోయా అక్తర్  సుహానాని లాంచ్ చేయడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. బాద్ షా సైతం జోయా ప్రాజెక్ట్ తోనే బెస్ట్ లాంచింగ్ అవుతుందని భావిస్తున్నారు.

ఇంటర్నేషనల్ కామిక్ పుసక్తం `అర్చీ` ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించాలని సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో ఓ టీనేజర్ కథ హైలైట్ గా ఉంటుంది. ఆ కథతోనే   సుహానా లాంచ్ అవుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం స్క్రిప్ట్ పై డిస్కషన్స్ జరుగుతున్నాయి. తుదిగా  షారుక్ నిర్ణయం తీసుకుంటారు. ఆయన గ్రీన్  సిగ్నల్  ఇవ్వగానే ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది. చిత్రాన్ని షారుక్ తన సొంత బ్యానర్ అయిన రెడ్ చిల్లీస్ ఎంటర్ టైన్  మెంట్స్ పై నిర్మించాలని ప్లాన్ చేస్తున్నారు.

ఖాన్ డాటర్ తో పాటు శ్రీదేవి రెండో కూతురు.. సైఫ్ కొడుకు  డెబ్యూలుగా..!

కింగ్ ఖాన్ షారూక్ వారసురాలు సుహానా ఖాన్ ప్రధాన పాత్రలో ప్రముఖ దర్శకురాలు జోయా అక్తర్ రూపొందించనున్న నెట్ ఫ్లిక్స్ సిరీస్ లో మరో ఇద్దరు స్టార్ కిడ్స్ ని కూడా జోయా అక్తర్ ఆడిషన్స్ చేసి ఎంపిక చేసుకున్నారని కథనాలొస్తున్నాయి. అందులో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ కుమారుడు ఇబ్రహీం అలీఖాన్.. అతిలోక సుందరి శ్రీదేవి- బోనీ కపూర్ ల రెండో కుమార్తె ఖుషీ కపూర్ పేర్లు వినిపిస్తున్నాయి. జోయా అక్తర్ నెట్ ఫ్లిక్స్ కోసం ప్రపంచవ్యాప్తంగా పాపులరైన ఆర్కిస్ కామిక్స్ ఆధారంగా దేశీ సిరీస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. జోయా ఇప్పటికీ తన దేశీ `ఆర్చీ`ని వెతుకుతూ.. అప్పటికే ఆమె బెట్టీ .. వెరోనికా పాత్రధారులను కనుగొన్నారని కథనాలొస్తున్నాయి. ఈ సిరీస్ లో ఖుషీ కపూర్ & సుహానా ఖాన్ లను వెరోనికా గా.. బెట్టీగా పరిచయం చేయబోతున్నారు. ఆర్చీ పాత్రలో ఇబ్రహీం అలీ ఖాన్ నటిస్తారని ప్రచారమవుతోంది.

ఈ సంవత్సరంలో ఇది గొప్ప కాస్టింగ్ ఎంపిక. ఇద్దరు స్టార్ డాటర్స్ బాలీవుడ్ లో ఎప్పుడు లాంచ్ అవుతారనే దానిపై ఎప్పటినుంచో ఊహాగానాలు కొనసాగుతున్నాయి. నిజానికి జాన్వీని ధడక్ చిత్రంతో తెరకు పరిచయం చేసిన కరణ్ జోహార్ ఖుషీని కూడా పరిచయం చేస్తారని భావించారు. కానీ ఇప్పుడు జోయాకు ఆ అవకాశం వెళ్లింది. నెట్ ఫ్లిక్స్ సిరీస్ కి సంబంధించిన ఇతర వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. జోయా అక్తర్ సిరీస్ లో సైఫ్ అలీ ఖాన్ -అమృత సింగ్ కుమారుడు ఇబ్రహీం ఆర్చీ పాత్ర పోషించే బలమైన అవకాశం ఉండగా.. ఖుషీ కి మంచి స్కోప్ దొరుకుతుందని ఊహాగానాలు ఇప్పటికి సాగుతున్నాయి. వీటిని అధికారికం చేయాల్సినది జోయా మాత్రమే. తుఫాన్ ముందు నిశ్శబ్ధంలా స్టార్ డాటర్ సుహానాలో మదనం ఇప్పుడు చర్చకు వస్తోంది.ఇతర వారసుల పరిస్థితి ఇంచుమించు ఇలానే ఉంటుందేమో!