షారూక్ లోని చిలిపితనం ఆ కళ్లలో

Tue Sep 17 2019 20:00:01 GMT+0530 (IST)

Suhana Khan Glamourous Pose

బాలీవుడ్ లో అంతమంది స్టార్లు ఉన్నా అందరిలో కింగ్ ఖాన్ షారూక్ ప్రత్యేకత ఏమిటి? అంటే ఆయన అభిమానులు స్పందించే తీరు చాలా యూనిక్ గా ఉంటుంది. స్టార్ హీరోలు ఎందరు ఉన్నా బాద్ షా ఒక్కడే అన్నదే వారి మాట ఎప్పటికీ. ఒకసారి షారూక్ కి అభిమానిగా మారితే ఆ తర్వాత అతడు నటించిన సినిమాల్ని విడిచిపెట్టకుండా చూస్తారనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులకు అర్థమయ్యే ఉంటుంది. షారూక్ ని భాషతో సంబంధం లేకుండా అన్ని భాషల్లోనూ అభిమానిస్తారు. ఫక్తు రొమాంటిక్ గయ్ గా అల్లరితనంతో కూడుకున్న చిలిపి నటనలో అతడిలోని అత్యంత ఆకర్షణీయమైన కోణం వేరొక హీరోలో చూడలేం.షారూక్ ఎక్స్ ప్రెషన్ యూనిక్. నవ్వు.. ఐ ఎక్స్ ప్రెషన్.. బాడీ లాంగ్వేజ్ ప్రతిదీ యూనిక్. ఎప్పుడో జమానా కాలంలో రిలీజైన దిల్ వాలే దుల్హానియా లేజాయేంగే (డీడీఎల్‌జే) ఒకే థియేటర్ లో సంవత్సరాల పాటు ఆడిందంటే అర్థం చేసుకోవచ్చు. ఆ సినిమాలో షారూక్ చిలిపితనం.. అల్లరి ప్రేమ అద్భుతాలు చేసింది. ఆ సినిమా తెలుగులో `ప్రేమించి పెళ్లాడుతా` పేరుతో తెలుగులోనూ రిలీజై ఆకట్టుకుంది. షారూక్- కాజోల్ జంటను ఇప్పటికీ మన ఆడియెన్ మర్చిపోలేరు.

ఆ తర్వాత మళ్లీ ఆ స్థాయిని షారూక్ నటవారసుడు ఆర్యన్ ఖాన్ నిలబెడతాడా? అంటూ చర్చ సాగుతోంది. కింగ్ ఖాన్ తర్వాత అతడి వారసుడికి టైమ్ వచ్చిందన్న చర్చ నడుమ .. మరో ఆసక్తికర విషయం వేడెక్కిస్తోంది. ఆర్యన్ వస్తాడో రాడో తెలీదు కానీ... ఈలోగానే షారూక్ గారాలపట్టీ సుహానా ఖాన్ బరిలో దిగితే బంతాటే అంటూ అభిమానుల్లో చర్చ సాగుతోంది. ఇదిగో తాజాగా సుహానా న్యూయార్క్ నుంచి రివీల్ చేసిన ఈ ఫోటో చూస్తే ఆ మాటను అంగీకరించి తీరాల్సిందే. ఈ ఫోటో చూడగానే నాటి షారూక్ లోని అల్లరితనం చిలిపితనం కనిపిస్తోంది. అచ్చం డాడీ నోట్లోంచి ఊడిపడిందా అన్నట్టు పోలిక సేమ్ టు సేమ్. ఆ చిలిపి కళ్లు... అల్లరి నవ్వు.. బోసి నోరు తెరిచి ఉంచిన వైనం.. చెయ్యి  చూపిస్తూ ఆ ఎక్స్ ప్రెషన్ అచ్చం పాపానే తలపిస్తోంది.  డాడీ ఏం చేశాడు కానీ.. గారాల పట్టీ బరిలో దిగితే బాక్సాఫీస్ కి బీటలే అన్నట్టుగా ఉందీ ఎక్స్ ప్రెషన్. ఆ చిలిపితనం అల్లరి బాక్సాఫీస్ వద్ద వందల కోట్ల వ్యాపారానికి  కారణమైంది. మరి సుహానా ఆ రేంజు తెస్తుందా? అన్నది చూడాలి. న్యూయార్క్ ఫిలింస్కూల్ లో నట శిక్షణ పూర్తి చేసుకుని త్వరలోనే బరిలోకి దిగే ముందే సుహానా ఇస్తున్న  ఈ క్లూ దేనికి సూచిక అన్నది అభిమానులే గెస్ చేయాల్సి ఉంటుంది.