Begin typing your search above and press return to search.

ఆ సినిమా ఫ్లాప్ అంటే ఒప్పుకోని హీరో

By:  Tupaki Desk   |   18 Aug 2022 5:30 AM GMT
ఆ సినిమా ఫ్లాప్ అంటే ఒప్పుకోని హీరో
X
కొన్ని సినిమాలు కమర్షియల్‌ గా ఆడకున్నా కూడా హిట్ అన్నట్లుగా పేరు దక్కించుకుంటాయి... మరి కొన్ని సినిమాలు కమర్షియల్‌ గా పర్వాలేదు అనిపించుకున్నా కూడా టాక్ మాత్రం ఫ్లాప్ అన్నట్లుగానే దక్కించుకుంటాయి. ఓటీటీ లో విడుదల అయిన నాని 25వ సినిమా 'వి' కి ఎలాంటి ఫలితం దక్కిందో అందరికి తెల్సిందే.

సినిమా డైరెక్ట్‌ ఓటీటీ స్ట్రీమింగ్ అవ్వడంతో జనాలు పట్టించుకోలేదు. పైగా సినిమా కు నెగటివ్ టాక్ కూడా వచ్చింది. అందుకే సినిమా ఫ్లాప్‌ అంటూ స్వయంగా నాని అభిమానులు కూడా తేల్చి పారేశారు.

కాని నాని ఆ సినిమా ను ఫ్లాప్ అంటే ఒప్పుకోలేదు. వి సినిమా ఒక మంచి సినిమా అంటూ చెప్పుకొచ్చాడు. తాజాగా ఆ సినిమాలో నటించిన మరో హీరో సుధీర్‌ బాబు కూడా అదే విషయాన్ని చెప్పుకొచ్చాడు.

సుధీర్‌ బాబు తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'వి' సినిమా ఫ్లాప్ కాదు అన్నట్లుగా చెప్పుకొచ్చాడు. వి సినిమా ఫ్లాప్‌ అంటూ ఒక రిపోర్టర్‌ మాట్లాడిన సమయంలో వెంటనే సుధీర్ బాబు ఆ సినిమా ఫ్లాప్ అంటే ఒప్పుకోను అన్నట్లుగా స్పందించడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ సినిమా తో చాలా ప్రశంసలు దక్కాయి అన్నట్లుగా సుధీర్ బాబు పేర్కొన్నాడు.

ఐఎండీబి తో పాటు పలు ప్లాట్ ఫామ్స్‌ పై కూడా సినిమాకు మంచి రేటింగ్ దక్కిందని సుధీర్‌ బాబు అన్నాడు. ఆన్‌ లైన్ లో ఇప్పటికి కూడా వి సినిమాకి మంచి వ్యూస్ వస్తున్నాయి అన్నట్లుగా ఆయన స్పందన ఉంది.

మొత్తానికి ఎవరు ఔను అన్నా ఎవరు కాదన్నా 'వి' సినిమా ఫలితం గురించి జనాలందరికి తెలుసు. ఆ సినిమా ఫలితం నేపథ్యంలో తదుపరి సినిమాల ఎంపిక చేసుకుంటే బాగుంటుందని మీడియా వర్గాల వారు సుధీర్‌ బాబుకి సూచిస్తున్నారు.