'దళపతి' టైటిల్ అనుకున్నాం.. దొరకలేదు

Tue Aug 13 2019 14:00:01 GMT+0530 (IST)

Sudheer Varma on About Ranarangam Movie Title

శర్వానంద్ హీరోగా సుధీర్ వర్మ డైరెక్షన్ లో తెరకెక్కిన 'రణరంగం' మరో రెండు రోజుల్లో థియేటర్స్ లోకి రానుంది. పిరియాడిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాతో మళ్లీ సక్సెస్ అందుకుంటాననే కాన్ఫిడెన్స్ తో ఉన్నాడు సుధీర్. ఈ సందర్భంగా దర్శకుడు మీడియా ముందుకొచ్చారు. అయితే ఈ సినిమా టైటిల్ గురించి కొన్ని విషయాలు చెప్పాడు సుధీర్.ఈ సినిమాకు ముందుగా దళపతి అనే టైటిల్ అనుకున్నామని కానీ ఆ టైటిల్ ఎంత ట్రై చేసినా దొరకలేదని తెలిపాడు. టైటిల్ సెలెక్ట్ చేసుకోవడానికి చాలా టైం తీసుకున్నాం. ఆ టైంలో మా నిర్మాత నాగ వంశీ 'రణరంగం' టైటిల్ ఎలా ఉంటుంది అని అడిగాడు. ఎందుకో అందరికీ ఆ సౌండింగ్ బాగా నచ్చింది. సో అదే ఫైనల్ చేసేసాం అంటూ చెప్పుకొచ్చాడు సుధీర్.

అంతే కాదు ఈ సినిమా తనకో ఛాలెంజింగ్ అన్నాడు. పీరియాడిక్ స్టోరీ కాబట్టి అప్పటి వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి చాలా కష్టపడ్డాం. ఒరిజినల్ లొకేషన్స్ లో షూట్ చేయలేక అల్యూమినియం ఫ్యాక్టరీలో సెట్ వేసి చేసాం. ఫోన్ వాడకుండా ఇప్పటి వస్తువులు కనబడకుండా చాలా జాగ్రత్త తీసుకున్నాం. ఇక కాకినాడలో కూడా ఇప్పటి వస్తువలేం కనబడకుండా వెహికిల్స్ చూపించకుండా ఎంతో జాగ్రత్త తీసుకొని షూట్ చేసాం. ఈ సినిమా కచ్చితంగా అందరినీ ఎంటర్ టైన్ చేసి సక్సెస్ అవుతుందని నమ్ముతున్నా.