'ఘరానా మొగుడు' ఫోజెందుకు శర్వా?

Wed Aug 14 2019 07:00:02 GMT+0530 (IST)

Sudheer Varma On about Ranarangam Movie

శర్వానంద్ కథానాయకుడిగా సుధీర్ వర్మ దర్శకత్వంలో సూర్య దేవర నాగవంశీ నిర్మించిన సినిమా `రణరంగం`. కళ్యాణి ప్రియదర్శన్ - కాజల్ కథానాయికలు. ఈనెల 15న సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజవుతోంది. మంగళవారం సాయంత్రం హైదరాబాద్ లో ప్రీరిలీజ్ వేడుకను నిర్వహించారు. ఈ వేడుకకు యంగ్ హీరో నితిన్ ముఖ్య అతిధిగా ఎటెండయ్యారు.ప్రీరిలీజ్ వేదికపై స్క్రీన్ పై ట్రైలర్.. పాటల్ని ప్రదర్శించారు. దీంతో పాటే శర్వానంద్ టీమ్ ఆన్ లొకేషన్ ఉన్నప్పటి ఫోటోల్ని తెరపై చూపిస్తూ దర్శకుడు సుధీర్ వర్మ ను కొన్ని ప్రశ్నలు అడిగారు. ఈ ప్రశ్నలకు అతడు ఆసక్తికర సమాధానాల్ని ఇచ్చారు. ఇక ఆ ఫోటోల్లో ఒక ప్రత్యేకమైన ఫోటో ఉంది. ఆ ఫోటో లో శర్వా `ఘరానా మొగుడు` చిరంజీవి తరహాలో నమస్కారం పెట్టే ఫోజు ఆకట్టుకుంది. అయితే ఈ ఫోజు ఎందుకు? అని ప్రశ్నిస్తే ఈ సినిమా కథ నడిచే కాలమానం అప్పటిది. 1990ల బ్యాక్ డ్రాప్ కాబట్టి అప్పటి సినిమా `ఘరానా మొగుడు` ఫోజును చూపించామని తెలిపారు. అలాగే స్పెయిన్ షెడ్యూల్ లో బిరియానీ తింటున్న ఫోటోని చూపించారు. స్పెయిన్ లో బిరియానీని పయ్యా అంటారని సుధీర్ వర్మ తెలిపారు.

వెర్సలైట్ స్టార్ శర్వానంద్ ని వ్యక్తిగతంగా చూస్తే అతడు మెగాస్టార్ చిరంజీవికి వీరాభిమాని. రామ్ చరణ్ కు అతడు స్నేహితుడు. అందువల్ల తన ఫేవరెట్ `ఘరానా మొగుడు` ఫోజును అనుకరించాడని భావించవచ్చు. ఇక శర్వాకు మెగా ఫ్యాన్స్ నుంచి ఆదరణ దక్కితే రణరంగం పెద్ద హిట్టయినట్టే.