Begin typing your search above and press return to search.

'V' స్క్రిప్ట్ మీద బాగానే వర్క్ చేసినట్లున్నారే.. మరి రిజల్ట్ ఎందుకు అలా వచ్చింది?

By:  Tupaki Desk   |   17 Sep 2020 8:30 AM GMT
V స్క్రిప్ట్ మీద బాగానే వర్క్ చేసినట్లున్నారే.. మరి రిజల్ట్ ఎందుకు అలా వచ్చింది?
X
నేచురల్ స్టార్ నాని - సుధీర్ బాబు హీరోలుగా నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ ''వి''. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు - శిరీష్‌ - హ‌ర్షిత్ రెడ్డి నిర్మించారు. ఈ చిత్రంలో అదితి రావ్ హైదరి - నివేదా థామస్ లు హీరోయిన్స్ గా నటించారు. నాని కెరీర్లో 25వ చిత్రం కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో ఇటీవలే ఈ సినిమాని ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ లో రిలీజ్ చేశారు. అయితే ఈ సినిమాకి ఓటీటీ ఆడియన్స్ నుంచి సినీ విశ్లేషకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. ఈ సినిమాపై ఫ్యాన్స్ బాగా నిరాశ చెందినట్లు తెలుస్తోంది. థియేటర్స్ లో విడుదల అవడం లేదని బాధ పడిన అభిమానులు.. సినిమా చూసిన తర్వాత 'V' మూవీని థియేటర్స్ లో రిలీజ్ చేయకపోవడమే మంచిదైందని కామెంట్స్ చేశారు. అంతేకాకుండా నాని కెరీర్ లో మైలురాయి లాంటి సిల్వర్ జూబ్లీ చిత్రానికి ఇలాంటి నేపథ్యాన్ని ఎలా ఎంచుకున్నాడని.. సెట్స్ మీదకు వెళ్ళడానికి ముందు స్క్రిప్ట్ పై వర్క్ చేయలేదా అని ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు.

ఈ నేపథ్యంలో 'వి' లో మరో హీరో సుధీర్ బాబు ఈ మూవీ స్క్రిప్ట్ విషయంలో ఎలాంటి డిస్కషన్ జరిగిందో చెప్తూ ట్విట్టర్ లో కొన్ని ఫోటోలు షేర్ చేశారు. రీడింగ్ అవర్స్ అంటూ సుధీర్ పోస్ట్ చేసిన ఈ ఫోటోలలో ఇంద్రగంటి మోహనకృష్ణ - నాని - సుధీర్ బాబు - నివేదా థామస్ - సీనియర్ నరేష్ - రోహిణి కనిపిస్తున్నారు. షూటింగ్ స్టార్ట్ అవకముందు జరిగిన స్క్రిప్ట్ రీడింగ్ సెషన్స్ లో వీళ్ళందరూ పాల్గొన్నారని తెలుస్తోంది. అయితే దీనిపై నెటిజన్స్ స్పందిస్తూ స్క్రిప్ట్ విషయంలో అంత కేర్ తీసుకొని అలాంటి సాధారణ రివేంజ్ డ్రామాని ఎలా తీసారని కామెంట్స్ చేస్తున్నారు. మీరు తీసిన సినిమాకి మీరు చేసిన హార్డ్ వర్క్ కి ఏమైనా సంబంధం ఉందా అని విమర్శిస్తున్నారు. మరికొందరైతే మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఎక్కడ అంటూ ట్రోల్ చేస్తున్నారు. నిజానికి ఈ సినిమాకి మిశ్రమ స్పందన వచ్చినా నాని - సుధీర్ బాబు - సినిమాటోగ్రాఫర్ కి మంచి పేరు వచ్చింది. ముఖ్యంగా సుధీర్ ఈ సినిమాకి బాగా కష్టపడ్డాడని మూవీలో అతన్ని చూస్తే అర్థం అవుతుంది. కానీ ఎంత కష్టపడినా ఒక్కోసారి అలానే అవుతుంది.. తాను ఒకటి తలిస్తే ఇంకొకటి అవుతుంది అనుకోని సరిపెట్టుకోవడమే అంటూ ఫ్యాన్స్ వ్యాఖ్యానిస్తున్నారు.