కేజీఎఫ్2 పై స్పందించిన ‘ఈగ’ విలన్

Sat Jul 11 2020 16:40:34 GMT+0530 (IST)

Eega villain who reacts on KGF2

కన్నడ సూపర్ హిట్ మూవీ ‘కేజీఎఫ్’ కు సీక్వెల్ గా రూపొందుతున్న కేజీఎఫ్ 2 లో కీలకమైన అధీరా పాత్రను సంజయ్ దత్ పోషిస్తున్న విషయం తెల్సిందే. ఆ పాత్ర సినిమాలో అత్యంత కీలకంగా ఉంటుందని అలాగే అత్యంత క్రూరంగా కూడా ఉంటుందని మొదటి నుండి ప్రచారం జరుగుతోంది. ఆ పాత్ర కోసం మొదట కన్నడ స్టార్ హీరో ఈగ విలన్ సుదీప్ ను సంప్రదించారనే వార్తలు వస్తున్నాయి. సుదీప్ నో చెప్పిన తర్వాతే ఆ పాత్రను సంజయ్ దత్ దగ్గరకు దర్శకుడు ప్రశాంత్ నీల్ తీసుకు వెళ్లాడంటూ కన్నడ మీడియాలో కొన్నాళ్ల క్రితం వార్తలు వచ్చాయి.తాజాగా ఒక ఇంటర్వ్యూలో సుదీప్ మాట్లాడుతూ.. కేజీఎఫ్ సినిమాలోని పాత్రకు నన్ను సంప్రదించారన్న వార్తలు పూర్తిగా అవాస్తవం. ఆ సినిమా కోసం ఎలాంటి పాత్రకు నన్ను సంప్రదించలేదు. కేజీఎఫ్ లో సంజయ్ దత్ గారు నటించడం చాలా సంతోషంగా ఉంది.

కన్నడ సినిమా పరిధి మరింతగా పెరుగుతుందని నమ్ముతున్నాను అన్నాడు. కేజీఎఫ్ మొదటి పార్ట్ పూర్తి అయిన తర్వాత విడుదలకు ముందు చూసేందుకు మాత్రమే నన్ను పిలిచారు. అంతకు మించి కేజీఎఫ్ మేకర్స్ తో చర్చలు జరపలేదని పేర్కొన్నాడు.