గ్లామరస్ బ్యూటీకి అలాంటి ఆఫర్లు మాత్రమే వస్తున్నాయట..!

Mon Jun 14 2021 12:17:27 GMT+0530 (IST)

Such offers are only coming for glamorous beauty ..!

'ఇస్మార్ట్ శంకర్' చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకున్న అందాల గని నిధి అగర్వాల్ కు ఎందుకనో తెలుగులో ఆశించిన స్థాయిలో అవకాశాలు రావడం లేదు. 'సవ్యసాచి' సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన 'మున్నా మైఖేల్' బ్యూటీ నిధి.. ఆ తర్వాత పూర్తిగా సౌత్ ఇండస్ట్రీపైనే ఫోకస్ పెట్టింది. 'మిస్టర్ మజ్ను' సినిమాతో ఆకట్టుకోవడం.. పూరీ సినిమాతో హిట్ కొట్టడంతో అమ్మడు క్రేజీ హీరోయిన్ గా మారిపోతోందని అందరూ అనుకున్నారు. కానీ సీన్ రివర్స్ అయింది.గ్లామరస్ నిధి కి ప్రస్తుతం తెలుగులో రెండు సినిమాలు మాత్రమే ఉన్నాయి. అందులో స్టార్ హీరో పక్కన నటిస్తున్న సినిమా ఒకటైతే.. మరొకటి డెబ్యూ హీరోకి జోడీగా చేస్తున్న చిత్రం. పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తున్న పీరియాడికల్ మూవీ 'హరి హర వీరమల్లు' లో నిధి హీరోయిన్ గా ఛాన్స్ దక్కించుకుంది. కాకపోతే ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఇస్మార్ట్ బ్యూటీకి పోటీగా మారనుంది.

అలానే మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా హీరోగా పరిచయం అవుతున్న చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ క్రమంలో ఇప్పుడు అమ్మడిని సీనియర్ హీరోల సరసన యాక్ట్ చేయాల్సిందిగా అడుగుతున్నారట. అయితే స్టార్ హీరోల పక్కన.. కుర్ర హీరోలకు జోడీగా నటించాలని ఆశ పడుతున్న నిధి.. సీనియర్ హీరోల ఆఫర్లను రిజెక్ట్ చేస్తోందట. మరి 'వీరమల్లు' సినిమా తర్వాత ఈ ముద్దుగుమ్మ కోరిక నెరవేరుతుందేమో చూడాలి.

ఇకపోతే కోలీవుడ్ లో కూడా లక్ టెస్ట్ చేసుకున్న ఈ బ్యూటీ.. రెండు తమిళ చిత్రాల్లో నటించింది. ఈ క్రమంలో ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్ట్ లో హీరోయిన్ గా నటించే అవకాశం అందుకుందని తెలుస్తోంది.