Begin typing your search above and press return to search.

తాప్సీ చెప్పిన సక్సెస్ మంత్ర..

By:  Tupaki Desk   |   24 Jan 2021 3:30 AM GMT
తాప్సీ చెప్పిన సక్సెస్ మంత్ర..
X
'ఝుమ్మంది నాదం' సినిమాతో తెలుగు తెరపై ఎంట్రీ ఇచ్చింది తాప్సీ. యాపిల్ పండులాంటి అందాల‌తో యూత్ గుండెల్లో కోటి వీణలు మోగించిందీ అమ్మడు. ఆ తర్వాత తెలుగులో మూడ్నాలుగు సినిమాల్లో కనిపించిన ఈ బ్యూటీ.. బాలీవుడ్ చెక్కేసింది.

అయితే.. బీటౌన్ కు వెళ్లిన త‌ర్వాత క్ర‌మంగా గ్లామ‌ర్ రోల్స్ కు దూర‌మైన తాప్సీ.. ప్రాధాన్య‌మున్న పాత్ర‌ల‌కే ఓటేయ‌డం మొద‌లు పెట్టింది. ఆ విధంగా.. త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన ఇమేజ్ క్రియేట్ చేసుకుంది తాప్సీ. సోష‌ల్ మీడియాలో అభిమానుల‌కు అందుబాటులో ఉంటూ.. త‌న కెరీర్‌, వ్య‌క్తిగ‌త అంశాల‌ను షేర్ చేసుకుంటోందీ బ్యూటీ.

కాగా.. తాజాగా సినీ కెరీర్ మొద‌లు పెడుతున్న వారికి, అరంగేట్రం చేయాల‌ని చూస్తున్న వారికి ఓ స‌ల‌హా ఇచ్చిందీ అమ్మ‌డు. 'ప్రియమైన నటీనటులారా.. తెరపై మనం ఎంత సేపు కనిపించామన్నది కాదు.. ఉన్న కొద్ది టైంలోనే ఎంత ప్రభావం చూపామన్నదే ముఖ్యం' అని చెప్పింది తాప్సీ.

తాను బాలీవుడ్లో సక్సెస్ అయ్యింది కేవలం ఏడు నిమిషాల పాత్రతోనే అని చెప్పింది తాప్సీ. 'బేబీ సినిమాలో చేసిన 7 నిమిషాల రోల్ నా కెరీర్ ను ముందుకు తీసుకెళ్లింది' అని ప్రకటించింది తాప్సీ. ఈ సినిమాలో అక్షయ్ కుమార్ తో కలిసి నటించింది తాప్సీ. ఈ చిత్రం 2015 లో ఇదే రోజున విడుదలైంది. ఈ నేపథ్యంలో వర్ధమాన నటీనటులకు ఈ సూచన చేసింది తాప్సీ.