అక్కినేని ఫ్యామిలీ కి పెద్ద దిక్కు ఆయనేనట

Thu Nov 14 2019 16:49:19 GMT+0530 (IST)

Subbi Rami Reddy Is Elder Brother to Akkineni family

తెలుగు లెజెండ్రీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు పేరు మీద జాతీయ అవార్డుల ను ఇస్తున్న విషయం తెల్సిందే. 2018 మరియు 2019 సంవత్సరాల కు గాను శ్రీదేవి మరియు రేఖల ను ఎంపిక చేసినట్లు గా జ్యూరీ చైర్మన్ టి సుబ్బి రామిరెడ్డి ప్రకటించారు. ఈనెల 17న అన్నపూర్ణ స్టూడియో లోనే ఈ అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నేడు అవార్డుల కు సంబంధించిన ప్రెస్ మీట్ ను నిర్వహించారు.ఈ సందర్బం గా అవార్డు ప్రధానోత్సవంకు ఏ ముఖ్యమంత్రి రాబోతున్నాడు అంటూ ప్రశ్నించగా ఎవరు రావడం లేదని సమాధానం వచ్చింది. ఇదే సమయం లో నాగార్జున మాట్లాడుతూ టీఎస్సార్ పై ఆసక్తి కర వ్యాఖ్యలు చేశాడు. మా నాన్న గారికి ఆప్త మిత్రుడు.. నాకు కూడా టీఎస్సార్ గారు చాలా ఆత్మీయుడు. నాన్నగారు పోయాక మా కుటుంబానికి పెద్ద దిక్కుగా ఈయనే నిలిచారు. ఏ సమయం లో సమస్య వచ్చినా కూడా ఖచ్చితంగా స్పందించి సాయం చేసేందుకు సిద్దంగా ఉంటారంటూ టీఎస్సార్ గురించి నాగార్జున అన్నాడు.

ఏఎన్నార్ జాతీయ అవార్డు ప్రధానోత్సవం వేడుక లోనే అన్నపూర్ణ ఫిల్మ్ స్కూల్ విద్యార్థుల కు పట్టాలు ఇవ్వబోతున్నట్లుగా నాగార్జున ప్రకటించారు. అమితాబచ్చన్ తో పాటు రాజమౌళి విద్యార్థుల కు పట్టాలిస్తారు. 2018 అవార్డును శ్రీదేవికి మరియు 2019 అవార్డును రేఖల కు ఇవ్వబోతున్నట్లుగా కూడా నాగార్జున పేర్కొన్నాడు. శ్రీదేవి లేరు కనుక ఆ అవార్డు ను ఆమె కుటుంబ సభ్యులకు అందజేసే అవకాశం ఉంది.