Begin typing your search above and press return to search.

మహేష్, ప్రభాస్ సీక్రెట్స్.. విప్పిన న‌టుడు సుబ్బరాజు!

By:  Tupaki Desk   |   20 Jun 2021 1:30 AM GMT
మహేష్, ప్రభాస్ సీక్రెట్స్.. విప్పిన న‌టుడు సుబ్బరాజు!
X
సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు, రెబల్ స్టార్ ప్ర‌భాస్‌.. టాలీవుడ్ లో టాప్ స్టార్ట్స్ గా వెలుగొందుతున్నారు. వీళ్లు తెర‌పై ఎలా ఉంటారు? అన్న‌ది అంద‌రికీ తెలిసిందే. కానీ.. బ్యాకెండ్ లో ఎలా ఉంటారు? ప‌ర్స‌న‌ల్ లైఫ్ లో ఎలా బిహేవ్ చేస్తుంటారు? అన్న‌ది మాత్రం ద‌గ్గ‌ర‌గా ఉన్న‌వాళ్ల‌కు మాత్ర‌మే తెలుస్తుంది. బ‌య‌టి వాళ్ల‌కు ఛాన్సే లేదు. ఆ సీక్రెట్స్ గుట్టు విప్పాడు టాలీవుడ్ క్యారెక్ట‌ర్ ఆర్టిస్టు కార్తీక్ సుబ్బరాజు.

తొలినాళ్ల‌లో విల‌న్ గా క‌నిపించిన సుబ్బ‌రాజు.. ఆ త‌ర్వాత విభిన్న పాత్ర‌లు పోషిస్తూ.. త‌న‌లోని పాజిటివ్ యాంగిల్ ను కూడా ఆడియ‌న్స్ కు చూపిస్తున్నాడు. హీరోలకు ఏ మాత్రం త‌గ్గ‌కుండా మంచి హైట్ తో, ప‌ర్ఫెక్ట్ ఫిజిక్ మెయింటెయిన్ చేసే సుబ్బ‌రాజు.. ఎలాంటి పాత్ర‌నైనా అవ‌లీల‌గా పోషించి శెభాష్ అనిపిస్తారు. దాదాపు ప‌ద్దెనిమిదేళ్లుగా ఇండ‌స్ట్రీల్లో కొన‌సాగుతున్న ఆయ‌న‌.. ఎన్నో మెమ‌బ‌ర‌బుల్ మూవీస్ లో యాక్ట్ చేశారు.

అయితే.. ఇటీవ‌ల ఓ క్ల‌బ్ హౌస్ సెష‌న్లో మాట్లాడిన సుబ్బ‌రాజు.. స్టార్ హీరోల గురించి ఇంట్ర‌స్టింగ్ విష‌యాలు పంచుకున్నారు. మ‌హేష్ బాబుతో సుబ్బ‌రాజు జ‌ర్నీ పోకిరీ నుంచి స్టార్ట్ అయ్యింది. ఈ సినిమాలో వీరిమ‌ధ్య వ‌చ్చే స‌న్నివేశాలు ఎంత‌గా పాపుల‌ర్ అయ్యాయో తెలిసిందే. ఆ త‌ర్వాత దూకుడు, బిజినెస్ మెన్‌, శ్రీమంతుడు చిత్రాల్లో క‌లిసి న‌టించారు.

ఈ సంద‌ర్భంగా మ‌హేష్ గురించి చెబుతూ.. ''పైకి మ‌హేష్ సున్నితంగా క‌నిపిస్తాడు. కానీ.. ఆయ‌న చాలా ప‌ర్ఫెక్ష‌నిస్టు. ప్ర‌తీ విష‌యంలోనూ స్పష్టత కోరుకుంటారు. ఏ పని అయినా.. పర్ ఫెక్ట్ గా చేయాలని అనుకుంటారు.'' అని చెప్పాడు సుబ్బూ.

ఇక, ప్రభాస్ గురించి కూడా చెప్పాడు. ''ప్రభాస్ మాత్రం పైకి చూడ్డానికి కఠినంగా కనిపిస్తాడు. కానీ.. చాలా సున్నితమైన వ్యక్తిత్వం గల మంచి మనిషి. ఆయనతో కలిసి వర్క్ చేయడం చాలా సరదాగా ఉంటుంది'' అని చెప్పాడు సుబ్బ‌రాజు. ప్ర‌భాస్ తో క‌లిసి మిర్చి, బుజ్జిగాడు, బాహుబ‌లి చిత్రాల్లో న‌టించిన సంగ‌తి తెలిసిందే.