స్టైల్ కా బాప్ అనిపించావ్ గా అనన్య!

Tue Nov 29 2022 16:17:16 GMT+0530 (India Standard Time)

Stylish Looks Of Ananya Panday

బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే టెంప్టింగ్ పోజుల గురించి చెప్పాల్సిన పనిలేదు. ఇన్ స్టా వేదికగా బ్యూటీ మంటలు రేపడం షరా మామూలే. డిజైనర్ దుస్తుల్లో తనదైన గ్లామ్ తో  ఆకట్టుకుటుంది. ఆల్ర్టా మోడ్రన్ లుక్ లోనూ అనన్య మెరుపులు సమ్ థింగ్ స్పెషల్ గా ఫోకస్ అవుతుంటాయి. స్టైలిష్ ఎంపికల్లోనూ అనన్య వావ్ అనిపిస్తుంది.తాజాగా బ్యూటీ డిజైన్డ్  లెదర్ దుస్తుల్లో స్టైల్ కా బాప్ అనిపిస్తుంది. ఇదిగో  బ్రౌన్ కలర్ లెదర్ డిజైన్ లో ఆకట్టుకుంటుంది. మ్యాచింగ్ ఇన్నర్ వేర్ సైతం  సేమ్ కలర్. ఆ బొందుల మధ్యలో  అనన్య అందాలు అంతే హైలైట్ అవుతున్నాయి.

స్టైలిష్ హెయిర్ స్టైల్   డ్రెస్..అందమైన పెదాలపై ఎర్రటి లిప్ స్టిక్..కవ్వించే కళ్లు ఆద్యంతం అమ్మడిలో బ్యూటీని హైలైట్ చేస్తున్నాయి.

ప్రస్తుతం ఈ ఫోటో ఇన్ స్టాలో వైరల్ గా మారింది. అభిమానులు సహా బాలీవుడ్ సెలబ్రిటీలు అనన్య ఫోజుపై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇక బ్యూటీ కెరీర్ సంగతి చూస్తే బాలీవుడ్ లో  బిజీ అయ్యే ప్రయత్నాల్లో  ఉంది. టాలీవుడ్ లో లైగర్ తో ఎంట్రీ ఇచ్చినా ఫలితం తేడాగా రావడంతో సీన్ అర్ధమైంది.

ఈ నేపథ్యంలో మరో ఆలోచన లేకుండా మాతృభాషలోనే మన ట్యాలెంట్కి తగ్గ అవకాశాలున్నాయని భావించి ఆ దిశగా అడుగులు వేస్తుంది. ప్రస్తుతం అమ్మడి చేతిలో రెండు ప్రాజెక్ట్ లు రెడీగా ఉన్నాయి. 'కో గయే హమ్ ఖాన్' చిత్రం  షూటింగ్ ఇప్పటికే పూర్తయింది.

ప్రస్తుతం ఆ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. మరో  సినిమా  'డ్రీమ్ గర్ట్ -2' షూటింగ్ దశలో ఉంది. ఈ రెండు సినిమాలపై అనన్య భారీ ఆశలు పెట్టుకుంది. హిట్ అయితే మరిన్ని ఛాన్సులు అందుకొవచ్చని ఆశిస్తుంది.  మరి అమ్మడి టైమ్ ఎలా నడుస్తుందో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.