సురేందర్ రెడ్డి నెక్స్ట్ ప్రాజెక్ట్ అదేనా...?

Tue Aug 11 2020 12:00:46 GMT+0530 (IST)

Stylish Director To Team Up With Akkineni Hero

'అతనొక్కడే’ చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు డైరెక్టర్ సురేందర్ రెడ్డి. ఫస్ట్ సినిమాతోనే ఇండస్ట్రీ మొత్తం తన వైపు చూసేలా చేసుకున్న సురేందర్ రెడ్డి.. ఆ తరవాత జూనియర్ ఎన్టీఆర్ తో 'అశోక్'.. సూపర్ స్టార్ మహేష్ బాబుతో 'అతిథి' సినిమాలు తెరకెక్కించి పరాజయాలు అందుకున్నాడు. కానీ తర్వాతి రోజుల్లో ‘కిక్’ ‘ధృవ’ 'రేసుగుర్రం' లాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ లతో సినిమాలు తీసి సూపర్ హిట్స్ అందుకున్నాడు ఈ స్టైలిష్ డైరెక్టర్. ఈ క్రమంలో సూరి గతేడాది మెగాస్టార్ చిరంజీవితో 'సైరా నరసింహారెడ్డి' సినిమా రూపొందించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకున్నా ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ రాబట్టలేకపోయిందనే టాక్ వినిపించింది. ఈ నేపథ్యంలో 'సైరా' విడుదలై తొమ్మిది నెలలు దాటినా సురేందర్ రెడ్డి తదుపరి సినిమా అనౌన్స్ చేయలేకపోయాడు.కాగా సూరి నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయంలో డైలీ ఏదొక న్యూస్ వస్తూనే ఉంది. ముందుగా ప్రభాస్ తో సురేందర్ రెడ్డి సినిమా ఉంటుందని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత నాగ చైతన్యతో స్టోరీ డిస్కషన్స్ జరుపుతున్నాడని.. అల్లు అర్జున్ తో 'రేసుగుర్రం' సీక్వెల్ ప్లాన్ చేస్తున్నాడని ఇండస్ట్రీ వర్గాల్లో చెప్పుకున్నారు. ఈ క్రమంలో లేటెస్టుగా అక్కినేని వారసుడు అఖిల్ తో సురేందర్ రెడ్డి తదుపరి సినిమా ఉంటుందని మరో న్యూస్ స్ప్రెడ్ అయింది. టాలీవుడ్ లో ఇప్పటి వరకు సరైన హిట్ లేకపోయినా అఖిల్ తనకంటూ స్పెషల్ క్రేజ్ ఏర్పరచుకున్నాడు. ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' అనే సినిమాలో నటిస్తున్నాడు అఖిల్. ఈ సినిమా తర్వాత స్టైలిష్ ఫిల్మ్ మేకర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ నెక్స్ట్ ప్రాజెక్ట్ చేయనున్నారని ఫిలిం సర్కిల్స్ లో వినిపిస్తోంది. మరి ఈ వార్తల్లో నిజమెంత ఉందో తెలియాలంటే ఇంకొన్నాళ్ళు ఆగాల్సిందే.