తెల్లచీర కట్టి చిచ్చురేపుతున్న అందాల రాక్షసి!!

Tue Jul 07 2020 17:01:06 GMT+0530 (IST)

Stunning Pic Of Lavanya Tripathi In Saree

ఏ మంత్రమో అల్లేసిందిలా.. అంటూ 2012లో 'అందాలరాక్షసి' సినిమాతో తెలుగు పరిశ్రమలో అడుగుపెట్టింది లావణ్య త్రిపాఠి. తన ఫస్ట్ సినిమాతోనే క్యూట్ క్యూట్ అభినయంతో ఆకట్టుకున్న లావణ్య.. టాలీవుడ్ కి మరో తెలుగు అమ్మాయి లాంటి అందం దొరికిందనే ఫీల్ కలిగించింది. ఇక ఈ డెహ్రాడూన్ అమ్మడికి తిరుగుండదులే అని అందరూ అనుకున్నారు. అనుకున్నట్టుగానే భలే భలే మగాడివోయ్.. శ్రీరస్తు శుభమస్తు.. సోగ్గాడే చిన్ని నాయనా.. హిట్లతో అభినయానికి అవకాశమున్న పాత్రలనే ఎంచుకుంటూ వచ్చింది ఈ ముద్దుగుమ్మ. కొంతకాలం తరువాత వరుస పరాజయాలతో లావణ్య వెనుక పడిపోయింది. ఇక ఈ హీరోయిన్ కెరీర్ ముగిసినట్టే అని అందరూ అనుకునేలా చేసింది.కానీ చాలా గ్యాప్ తీసుకొని మళ్లీ ఇటీవలే 'అర్జున్ సురవరం' సక్సెస్ తో ఈ 'అందాల రాక్షసి' సక్సెస్ ట్రాక్ ఎక్కింది. అయితే అందాల రాక్షసి నుండి అర్జున్ సురవరం వరకు లావణ్య ఒక్కసారి కూడా టాప్ లిస్టులో అడుగు పెట్టలేకపోయింది. ఇక తాజాగా అమ్మడు ఇంస్టాగ్రామ్ వేదికగా అందాల విందు ఆరంభించింది. ప్రస్తుతం లావణ్య యువ హీరోలతో వరుసగా సినిమాలు చేస్తోంది. ఇటీవలే తమిళంలో 'వాల్మీకి' ఫేమ్ అధర్వ మురళీ సరసన నటించే అవకాశాన్ని దక్కించుకుంది. అలాగే సందీప్ కిషన్ 'ఏ1 ఎక్స్ ప్రెస్' చిత్రంలో లావణ్య హాకీ ప్లేయర్‌గా నటిస్తోంది.

వీటితో పాటు కార్తికేయ హీరోగా నటిస్తున్న 'చావు కబురు చల్లగా'లో  హీరోయిన్‌గా ఫైనలయింది. ఇటీవల అవసరమైతే బికినీ అందాలను ఆరబోయడానికి తాను సిద్ధమంటూ సంచలనం రేపింది. తాజాగా లావణ్య ఇంస్టాగ్రామ్ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వైట్ సారీ కట్టుకొని చాలా పద్ధతిగా ఎలాంటి గ్లామర్ షో చేయకుండా సింపుల్ పోజిచ్చింది. కానీ చీర కడితే ఎలాంటి బ్యూటీ అయినా వారి అందం రెట్టింపు అవుతుందని మళ్లీ నిరూపించిందని నెటిజన్లు తెగ పొగిడేస్తున్నారు. మరి అమ్మడు త్వరలో ఏదైనా భారీ హిట్ కొడుతుందేమో చూడాలి!