నో డౌట్ తారక్ ఫ్యాన్స్ ని టెంప్ట్ చేసేందుకే ఇలా!

Fri Mar 31 2023 18:49:46 GMT+0530 (India Standard Time)

Stunning Janhvi Kapoor In Bikini Suit

అతిలోక సుందరి శ్రీదేవి నటవారసురాలు జాన్వీ కపూర్ జోరు పెంచేస్తోంది. ఓవైపు బాలీవుడ్ లో క్రేజీ ప్రాజెక్టుల్లో నటిస్తూనే మరోవైపు నాయికా ప్రధాన కథాంశాలను ఎంచుకుంటూ తనదైన ఒరవడితో సత్తా చాటే ప్రయత్నం చేస్తోంది. ఇంతలోనే సౌత్ లో ఘనంగా ఆరంగేట్రం చేయాలని కలలుగంది. ఆ కలల్ని నిజం చేస్తూ జూ.ఎన్టీఆర్ సరసన కొరటాల శివ దర్శకత్వంలో భారీ పాన్ ఇండియా మూవీలో ఆఫర్  ఛేజిక్కించుకుంది. చిరుతనయుడి సరసన లేదా బన్ని సరసన నటిస్తుందని ప్రచారమైనా కానీ చివరికి డెబ్యూ నందమూరి బుల్లోడి సరసన కుదిరిందంటూ ముచ్చట సాగుతోంది.అయితే జాన్వీ రొటీన్ కి భిన్నంగా నెపోటిజం ఆరోపణలను ఎదుర్కొంటోంది. జూ. NTR సరసన టాలీవుడ్ ఆరంగేట్రం చేయడం కొందరికి గిట్టడం లేదు. ఇలాంటి అరంగేట్రం చేసినందుకు జాన్వీ కపూర్ నెపోటిజంపై ట్రోలర్లు విరుచుకుపడ్డారు. పాపా హిందీ మే తో చలా నహీ పాయే.. అంటూ కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఎన్టీఆర్ 30 ఆఫర్ దక్కించుకున్నందుకు గాను జాన్వీ కపూర్ సూటిపోటి మాటలను ఎదుర్కొంటోంది. ఇటీవల హైదరాబాద్ లో జరిగిన లాంచ్ ఈవెంట్ లో జాన్వీ ఎంతో అందంగా కనిపించింది.

అదే క్రమంలో బంధుప్రీతి మరోసారి చర్చనీయాంశమైంది. ఒక నటవారసుడి సరసన ఇంకో నటవారసురాలికి ఆఫర్ వచ్చిందంటూ కొందరు నెటిజనులు ట్రోలింగ్ చేసారు. చాలా మంది నెటిజనులు ట్విట్టర్ లో మీమ్ ఫెస్ట్ ను ప్రారంభించారు. ట్వీట్లలో జాన్వీపై సరదాగా పోక్ చేశారు. ఒక నెటిజనుడు ''పాపా హిందీ మే తో చలా నహీం.. సౌత్ ట్రై కర్తే హైన్'' అని ట్వీట్ చేశారు. మరొకరు ''దయచేసి దక్షిణాదికి వెళ్లిపోవద్దు. మృణాల్- యామి లాంటి నటీమణులు మాకు కావాలి'' అని వ్యాఖ్యానించారు. ''నేపో కోటా మే ఆగే బాధ్తే హుయే జాన్వీ కపూర్'' అని ఒకరు ట్రోల్ చేసారు. నిజానికి ఎన్టీఆర్ లాంటి స్టార్ సరసన అవకాశం వస్తే ఏమాత్రం ఆలోచించకుండా ఓకే చెబుతానని జాన్వీ కపూర్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. తాను ఆశించిన ఆ ఒక్క ఛాన్స్ ఇక్కడ లభించింది. తెలుగు లోగిళ్లలో అతిలోక సుందరి కి ఉన్న ఫాలోయింగ్ దృష్ట్యా జూ.అతిలోక సుందరి అని పిలిపించుకునేంతగా తన నటప్రదర్శనతో ఆకట్టుకుంటుందనే భావిద్దాం.

జాన్హ్వి కపూర్ హిందీ నటి. బోనీ కపూర్ - శ్రీదేవిల కుమార్తె. ఆమెకు ఖుషీ కపూర్ అనే ఒక చెల్లెలు ఉంది. కథానాయికగా చలనచిత్ర రంగ ప్రవేశానికి ముందు కాలిఫోర్నియాలోని లీ స్ట్రాస్ బర్గ్ థియేటర్ -ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుండి నటనా కోర్సును అభ్యసించింది. 2018లో ఇషాన్ ఖట్టర్ తో కలిసి ధడక్ తో అరంగేట్రం చేసింది. 2020లో గుంజన్ సక్సేనా: ది కార్గిల్ గర్ల్ తో చిత్ర పరిశ్రమపై తనదైన ముద్ర వేసింది.  రూహి - ఘోస్ట్ స్టోరీస్ వంటి చిత్రాలలో కనిపించింది. ఆమెకు 2018లో నార్వేజియన్ కాన్సులేట్ జనరల్ ద్వారా 'రైజింగ్ టాలెంట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు' లభించింది.

జాన్వీకపూర్ బాలీవుడ్ లోకి అడుగు పెట్టకముందే మీడియా దృష్టిలో పడింది. ధడక్ రిలీజ్ కాక ముందే డెబ్యూ నటిగా అటు హిందీ బెల్ట్ తో పాటు ఇటు తెలుగు ఆడియెన్ దృష్టిలోను పడింది. ఇప్పుడు ఎన్టీఆర్ సరసన ఆఫర్ దక్కడంతో అన్ని కళ్లు తనపైనే ఉన్నాయి. దీంతో జాన్వీ కపూర్ లేటెస్ట్ ఫోటోషూట్ల తీరు తెన్నులు కూడా అమాంతం మారిపోయాయి.

తాజాగా పింక్ గులాబీలతో డిజైనర్ బ్రాలెట్ లో జాన్వీ మెరుపులు మెరిపించిన తీరు మతులు చెడగొట్టింది. ఇది కచ్ఛితంగా తారక్ అభిమానులను టెంప్ట్ చేయడమేననడంలో సందేహం లేదు! అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు. పింక్ బ్రా.. కాంబినేషన్ బాటమ్ తో సముద్రంలో విహరిస్తూ కనిపించింది జాన్వీ. ప్రస్తుతం ఈ స్పెషల్ ఫోటోగ్రాఫ్ అంతర్జాలంలో వైరల్ గా మారింది. దీనిపై తారక్ అభిమానులు లవ్ ఈమోజీలతో ప్రేమను కురిపిస్తున్నారు.నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.