డెనిమ్ నిక్కరుతో ఊర్వశి కిల్ చేస్తోందిగా

Fri Dec 04 2020 16:00:01 GMT+0530 (IST)

Stunning Beauty Urvashi Rautela

హేట్ స్టోరి 4 .. గ్రాండ్ మస్తీ లాంటి వేడెక్కించే సినిమాల్లో నటించింది ఊర్వశి రౌతేలా. బుల్లితెర నుంచి వెండితెర వెలుగులు చిందిస్తున్న భామగా ఊర్వశికి చక్కని ఫాలోయింగ్ ఉంది.ఈ అమ్మడు ప్రస్తుతం పలు క్రేజీ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. ఇక సినిమాలతో కంటే తనదైన స్పీడ్ యాటిట్యూడ్ తో సోషల్ మీడియాల్లో అసాధారణ ఫాలోవర్స్ ని సంపాదించుకుంటోంది. ఇప్పటికే లక్షల్లో జనం ఊర్వశి ఇన్ స్టా ను అనుసరిస్తున్నారు.

ఇంతకుముందు ఊర్వశి మాల్దీవుల విహార యాత్ర సంచలనంగా మారింది. ఒంటరి దీవుల్లో బికినీ బీచ్ సెలబ్రేషన్స్ తో ఊర్వశి అగ్గి రాజేసింది. అందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ అయ్యాయి. తాజాగా ఊర్వశి ధరించిన వైట్ డెనిమ్ షార్ట్ ఫ్లోరల్ డిజైన్ లుక్ లో ప్రత్యేక ఆకర్షణగా మారింది. వైట్ టాప్ కాంబినేషన్ .. దానికి తగ్గ బ్లాక్ కూల్ గ్లాసెస్ తో స్మైలీ లుక్ తో అదరగొట్టేస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటో యువతరంలో వైరల్ గా మారింది.