ఫోటో స్టోరి: పూజా నయా లుక్ కి మైండ్ బ్లాంక్

Thu Dec 01 2022 21:52:19 GMT+0530 (India Standard Time)

Stunning Beauty Pooja Hegde New Look

అందాల పూజా హెగ్డే నయా లుక్ మతులు చెడగొడుతోంది. బాలీవుడ్ లో ఇప్పుడు ఈ భామ ఫ్యాషన్ మెరుపులు మిలమిలల గురించి యువతరం చర్చించుకుంటోంది. ఓవైపు సారా అలీఖాన్ .. జాన్వీ కపూర్.. అనన్య పాండే లాంటి స్టార్ కిడ్స్ ఫ్యాషన్ ప్రపంచపు రాకుమార్తెలుగా వెలిగిపోతుంటే వీళ్లెవరికీ తీసిపోని రీతిలో పూజా హెగ్డే స్టైల్ కంటెంట్ పరంగాను కాంపిటీటర్ గా మారింది. ఓ వైపు క్రేజీ సినిమాల్లో నటిస్తూనే మరోవైపు ఫ్యాషన్ సెన్స్ లోను సత్తా చాటుతోంది.ఇటీవలే తన సినిమా సర్కస్ టీజర్ లాంచ్ వేడుకలో ఇదిగో ఇలా ప్రత్యక్షమైంది పూజా. స్టైలిష్ బ్రౌన్ కలర్ కాటన్ జీన్స్.. దానికి కాంబినేషన్ గా బ్లాక్ టాప్ తో అదరగొట్టింది. ఈ డ్రెస్ కి కాంబినేషన్ గా బ్లాక్ లెదర్ బ్యాగ్... బ్లాక్ గాగుల్స్ కిక్ ని పెంచాయి. ఇంకా చెప్పాలంటే మన బుట్టబొమ్మ 'మ్యాట్రిక్స్' హీరోయిన్ కారీ అన్నే మోస్ నే గుర్తు చేసిందంటే అతిశయోక్తి కాదు.

విలియం షేక్స్పియర్ నాటకం 'ది కామెడీ ఆఫ్ ఎర్రర్స్' ఆధారంగా రోహిత్ శెట్టి దర్శకత్వం వహించిన 'సర్కస్' 1960 ల నేపథ్యంలో తెరకెక్కింది.ఈ చిత్రంలో రణవీర్ సింగ్- పూజా హెగ్డే-జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తదితరులు నటించారు. రోహిత్ శెట్టి విశ్వంలో ప్రధాన పాత్రల్ని ఆసక్తికరంగా మలిచారని ఇటీవల విడుదలైన టీజర్ వెల్లడించింది. డిసెంబర్ 2న ట్రైలర్ విడుదలకు ముందే టీజర్ అభిమానులకు ఫుల్ కిక్కిచ్చింది.

గతంలో జీవితం చాలా సరళంగా ఉండేది.. తాతయ్య.. నానమ్మల రోజులు వేరు.. ఇప్పటి రోజులు వేరు.. నాటి కాలమానానికి అప్పటి వ్యక్తిత్వాల ఆధారంగా రూపొందిన చిత్రమిది.

పాత్రల ఆహార్యంలో హాస్యాన్ని జోడించి సర్కస్ చిత్రాన్ని తెరకెక్కించారు. కథ కొత్తదేమీ కాకపోయినా ఈ సినిమాని కామిక్ టచ్ తో రోహిత్ శెట్టి నడిపించిన తీరు ఆకట్టుకుంటుందని టీజర్ భరోసానిచ్చింది.

జీవితం సాదాసీదాగా ఉన్న ఆ కాలంలో సాగే సినిమా ఇది. ఆ రోజుల్లో తల్లిదండ్రులు తాతయ్య అమ్మమ్మల ప్రేమ చాలా ముఖ్యం.  సోషల్ మీడియా లైక్ లు క్లిక్ లు కాదు!! అంటూ రణ్ వీర్ సింగ్ పాత్ర టీజర్ లో వెల్లడించింది. అతడు ఈ చిత్రంలో ద్విపాత్రాభినయం చేయడం ఆసక్తిని కలిగిస్తోంది. ఇందులో పూజ హెగ్డే పాత్ర సంథింగ్ స్పెషల్ గా కనిపిస్తోంది. ఈ ఏడాది క్రిస్మస్ కానుకగా సర్కస్ విడుదలవుతుందని సమాచారం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.