ఇంట్రెస్టింగ్ గా 'ప్రేమమ్' హీరో నటించిన "మహవీర్యర్" ఫస్ట్ లుక్..!

Fri Feb 11 2022 22:00:01 GMT+0530 (India Standard Time)

Striking first look poster of Nivin Pauly Maha Veeryar

'ప్రేమమ్' ఫేమ్ మలయాళ స్టార్ నివిన్ పాలీ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ''మహవీర్యర్''. ప్రముఖ రచయిత ఎం ముకుందన్ రాసిన కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. అబ్రిడ్ షైన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో అసిఫ్ అలీ మరో కీలక పాత్రలో నటిస్తున్నారు.ఫాంటసీ - టైమ్ ట్రావెల్ - న్యాయ సూత్రాల ప్రాధాన్యత వంటి అంశాలు కలబోసిన కథతో ఈ చిత్రం రూపొందుతోంది. కొచ్చిన్ లో జరిగిన కార్యక్రమంలో రచయిత ఎం ముకుందన్ ''మహవీర్యర్'' సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ ఈవెంట్ లో దర్శకనిర్మాతలు ప్రధాన నటీనటులు పాల్గొన్నారు.

'మహవీర్యర్' ఫస్ట్ లుక్ పోస్టర్ ఆసక్తికరంగా ఉంది. నివిన్ తపస్సు చేస్తున్న మునిగా కనిపిస్తుండగా.. అసిఫ్ అలీ ఒక వీరుడి గెటప్ లో ఉన్నాడు. ఇండియన్ మూవీ మేకర్స్ సంస్థతో కలిసి హీరో నివీన్ పాలీ తన సొంత ప్రొడక్షన్ కంపెనీ పాలీ జూనియర్ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. పీఎస్ షన్మాస్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

పాండమిక్ ఆంక్షల మధ్య రాజస్థాన్ - కేరళలో అందమైన లొకేషన్స్ లో ఈ సినిమా చిత్రీకరణ జరిపారని తెలుస్తోంది. ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగించేలా భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని తీర్చిద్దుతున్నారు. ఇందులో లాల్ - లలు అలెక్స్ - సిద్ధిఖీ - శాన్వీ శ్రీవాస్తవ - విజయ్ మీనన్ - మేజర్ రవి - మల్లిక సుకుమారన్ - కృష్ణ ప్రసాద్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

'మహవీర్యర్' చిత్రానికి చంద్రూ సెల్వరాజ్ సినిమాటోగ్రఫీ అందించగా.. ఇషాన్ చాబ్రా సంగీతం సమకూర్చారు. మనోజ్ ఎడిటర్ గా.. అనీస్ నాడోడి ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నారు. 'యాక్షన్ హీరో బిర్జు' తర్వాత దాదాపు పదేళ్ల తర్వాత నివీన్ - దర్శకుడు అబ్రిడ్ షైన్ కాంబోలో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.