Begin typing your search above and press return to search.

ఢిల్లీ లోని ఓ గల్లీకి హీరో పేరు పెట్టారు

By:  Tupaki Desk   |   22 Jan 2021 3:50 AM GMT
ఢిల్లీ లోని ఓ గల్లీకి హీరో పేరు పెట్టారు
X
బాలీవుడ్ యంగ్ అండ్‌ ట్యాలెంటెడ్‌ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పూత్ మృతి షాక్‌ నుండి అభిమానులు ఇంకా పూర్తిగా బయటకు వచ్చినట్లుగా లేరు. ఆయన పుట్టిన రోజు సందర్బంగా నిన్న సోషల్‌ మీడియాలో తెగ సందడి వాతావరణం కనిపించింది. అభిమానులతో పాటు ప్రతి ఒక్క సినీ ప్రేమికుడు కూడా సుశాంత్ సింగ్ రాజ్ పూత్ ను గుర్తుకు తెచ్చుకున్నారు అనడంలో సందేహం లేదు. ఆయన నటించిన సినిమాల్లోని క్లిప్లింగ్ లను సోషల్ మీడియాలో షేరింగ్ లు చేసుకున్నారు. ఈ సమయంలోనే ఢిల్లీలోని ఓ గల్లీకి సుశాంత్ సింగ్ రాజ్‌ పూత్‌ మార్గ్ అంటూ నామకరణం చేస్తూ స్థానిక మున్సిపల్‌ అధికారులు ఆదేశాలు ఇచ్చారు.

ఢిల్లీలోని ఆండ్రూస్‌ గంజ్ లో ఉన్న ఒక రోడ్ లో బీహార్‌ కు చెందిన కుటుంబాలు ఎక్కువగా నివాసం ఉంటాయి. అందుకే స్థానిక కాంగ్రెస్‌ పార్టీ కౌన్సిలర్‌ గత ఏడాది సెప్టెంబర్‌ లో దివంగత సుశాంత్ సింగ్‌ పేరును ఆ రోడ్డుకు పెట్టాలని ప్రతిపాధించాడు. తాజాగా ఆ ప్రతిపాధనకు ఓకే చెప్పడం జరిగింది. అధికారికంగా ఆ రోడ్డుకు రీ నేమింగ్ అయ్యింది. సుశాంత్ సింగ్ కు నిన్నటి బర్త్‌ డేతో 35 ఏళ్లు నిండాయి. ఆయన మృతి సినిమా లోకం ఒక మంచి తారను కోల్పోయిందని మరోసారి ఇండస్ట్రీ వర్గాలు కూడా సోషల్‌ మీడియాలో తమ జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు.