Begin typing your search above and press return to search.

స్ట్రేంజర్ థింగ్స్ అరాచకం.. ఓటీటీలో న్యూ రికార్డ్

By:  Tupaki Desk   |   3 Dec 2022 7:30 AM GMT
స్ట్రేంజర్ థింగ్స్ అరాచకం.. ఓటీటీలో న్యూ రికార్డ్
X
ఫాంటసీ థ్రిల్లర్‌లు నెట్‌ఫ్లిక్స్‌ లో మంచి రెస్పాన్స్ ను అందుకుంటున్నాయి. ఎక్కువగా అలాంటి కంటెంట్ తో వచ్చే సినిమాలు వెబ్ సిరీస్ లో ఊహించని విధంగా రికార్డులు క్రియేట్ చేస్తూ ఉంటాయి. ఇటీవల కాలంలో ఓటీపీ ప్రపంచంలో ఎక్కువ స్థాయిలో స్ట్రీమింగ్ అయిన వెబ్ సిరీస్ లో అలాంటి వాటి సంఖ్య మరింత పెరుగుతోంది. ఇక ఇటీవల వెడ్నెస్ డే అనే ఒక సిరీస్ ఊహించిన విధంగా మంచి రెస్పాన్స్ అందుకుంది.

ఒక వారంలోని అత్యధిక మంది వీక్షించిన సిరీస్ లలో వెడ్నెస్ అదొకటిగా నిలిచింది. ఓటీటీ ప్రపంచంలో ఇప్పుడు ఈ సీరీస్ కంటే ఎక్కువ స్థాయిలో స్ట్రీమింగ్ అయినదిగా మరో వెబ్ సీరీస్ గుర్తింపు అందుకోవడం విశేషం. ఇటీవల ఆ రికార్డును స్ట్రేంజర్ థింగ్స్ 4 బ్రేక్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. గత మూడు సీజన్ కూడా సక్సెస్ కావడంతో ఇటీవల నాలుగో సీజన్ కూడా విడుదల చేశారు.

దానికి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఒక వారంలో ఈ వెబ్ సిరీస్ 341 మిలియన్ గంటల వ్యూస్ సొంతం చేసుకుని సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది.

వెడ్నెస్ డే సీరీస్ మాత్రం ఇంతకు ముందు అంతకంటే తక్కువ స్థాయిలో వీక్షణాలను అందుకుంది. ఇక ప్రస్తుతం 83 దేశాల్లో ఇది నెం.1 స్థానంలో ట్రెండింగ్‌లో ఉంది.

ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లో మొదటి నెలలో అత్యధికంగా వీక్షించిన ఇంగ్లీష్ వెబ్ సిరీస్‌లో స్ట్రేంజర్ థింగ్స్ ఒకరు. మొత్తంగా 1.35 బిలియన్ గంటల వీక్షకులతో "స్ట్రేంజర్ థింగ్స్" రికార్డు క్రియేట్ చేసింది. ఇక "వెడ్నెస్ డే" ఆ రికార్డును బ్రేక్ చేస్తుందో లేదో చూడాలి. "వెడ్నెస్ డే" చిత్రంలో జెన్నా ఒర్టెగా, గ్వెండోలిన్ క్రిస్టీ, లూయిస్ గుజ్మాన్ కేథరీన్ జీటా-జోన్స్ ప్రధాన పాత్రలు పోషించారు.

ఇది నిగూఢమైన ఆత్మలు అలాగే అతీంద్రియ ఆత్మలతో నిండిన డిఫరెంట్ కథ.ఇది హ్యారీ పాటర్ తరహాలో స్ఫూర్తి పొందిన కథ అని చెప్పవచ్చు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.