Begin typing your search above and press return to search.

స‌మంత గ్లామ‌ర్ ట్రీట్ వెనుక క‌హానీ అదా?

By:  Tupaki Desk   |   27 Jun 2022 12:30 AM GMT
స‌మంత గ్లామ‌ర్ ట్రీట్ వెనుక క‌హానీ అదా?
X
స‌మంత గ్లామ‌ర్ డోస్ పెంచిన సంగ‌తి తెలిసిందే. `పుష్ప` లో `ఊ అంటావా మావ` పాట‌లో సామ్ గ్లామ‌ర్ షో ఏ రేంజ్ లో ప‌డింది. స‌మంత షాకింగ్ ట్రాన్స‌ప‌ర్మేష‌న్ చూసి టాలీవుడ్ సైతం షాక్ అయింది. అప్పుడే నాగ‌చైత‌న్య‌తో విడాకులు కావ‌డం...సామ్ పాట‌ లో అందాల విందు చేయ‌డం పెద్ద సంచ‌ల‌న‌మే అయింది. వివాహం త‌ర్వాత సెల‌క్టివ్ గా కొన‌సాగిన సామ్ లో ఛేంజ్ ఒక్క‌సారిగా అంద‌ర్ని ఆలోచ‌న‌లో ప‌డేసింది.

ఇదే వేవ్ లో బ్యాక్ టూ బ్యాక్ ఛాన్సులు ఖాతాలో వేసుకోవ‌డం ఆశ్చ‌ర్యంగానే అనిపించింది. రెండు లేడీ ఓరియేంటెడ్ ప్రాజెక్ట్ ల‌కు సైన్ చేయ‌డం....వాటిని సెట్స్ పైకి తీసుకెళ్ల‌డం అంతా చ‌క‌చ‌కా జ‌రిగిపోయింది. అలాగే సామ్ కొన్ని నెల‌లుగా బాలీవుడ్ కెరీర్ పైనే ఎంతో ఏకాగ్ర‌త‌గా ప‌నిచేస్తోన్న సంగ‌తి తెలిసిందే. ముంబైలో ప్లాట్ తీసుకోవ‌డం..ఎక్కువ‌గా హిందీ వాళ్ల‌కు ట‌చ్ లో ఉండ‌టం వంటి అంశాలు సామ్ ని టాలీవుడ్ కి దూరం చేస్తుందా? అన్న సందేహం సైతం మొద‌లైంది.

వీట‌న్నింటి న‌డుమ తాజాగా సామ్ గురించి ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఒక‌టి అందింది. సమంత స్కిన్ షో వెనుక పాన్ ఇండియాలో ఫేమ‌స్ కావాల‌నే ఆలోచ‌న దాగి ఉంద‌ని టాక్ వినిపిస్తుంది. ఆ కార‌ణంతోనే సామ్ గ్లామ‌ర్ డోస్ పెంచింద‌ని అంటున్నారు. ప్ర‌స్తుతం బాలీవుడ్ ఛాన్సులు కోసం ఎదురుచూస్తోన్న నేప‌థ్యంలో స్కిన్ షో అనేది ఎర‌గా వ‌ర్కౌట్ అవుతుంద‌న్న ఆలోచ‌న క‌నిపిస్తుంది. బాలీవుడ్ మేక‌ర్స్ కి అనుగుణంగా ఉండాలంటే గ్లామ‌ర్ త‌ప్ప‌నిస‌రి.

టాలీవుడ్ త‌ర‌హాలో నిబంధ‌న‌ల‌తో పనిచేస్తానంటే కుద‌ర‌దు. గ్లామ‌ర్ ఎలివేష‌న్ విష‌యంలో త‌న‌దైన మార్క్ త‌ప్ప‌నిస‌రి. అప్పుడే అక్క‌డ అవ‌కాశాలు క్యూ క‌ట్టేది. ఇప్ప‌టికే స‌మంత హిందీలో `ఏక్ దీవానా` లో గెస్ట్ అప్పిరియ‌న్స్ ఇచ్చింది. దాదాపు 12 ఏళ్ల క్రితం రిలీజ్ అయిన సినిమా. ఆ త‌ర్వాత సామ్ హిందీ ప‌రిశ్ర‌మ వైపు చూడ‌లేదు. తెలుగు..త‌మిళ్ లోనే సినిమాలు చేసింది. అప్ప‌ట్లో అవ‌కాశాలు కోసం సీరియ‌స్ గా ప్ర‌య‌త్నాలు కూడా చేయ‌లేదు. స‌డెన్ గా ఆ ప్రాజెక్ట్ అలా కుద‌ర‌డంతో ఒకే చెప్పింది.