ఎన్టీఆర్-నీల్ సినిమాకు కథ రెడీ?

Tue Aug 11 2020 14:40:29 GMT+0530 (IST)

Story Ready for NTR-Neil movie?

‘ఆర్ఆర్ఆర్’తో జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్‌లు తమ కెరీర్ పీక్స్‌ను అందుకుంటారని అంతా అంచనా వేస్తున్నారు. ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ లాగే.. రామ్ చరణ్ ఎన్టీఆర్‌ల ఇమేజ్ కూడా మారిపోతుందని భావిస్తున్నారు. ఈ చిత్రం తర్వాత చరణ్ సినిమా ఏంటన్నదానిపై స్పష్టత లేదు. ఎన్టీఆర్ మాత్రం ఒకటికి రెండు సినిమాలను ఖరారు చేశాడు. అందులో ఒకటి త్రివిక్రమ్ సినిమా కాగా.. మరొకటి ‘కేజీఎఫ్’ దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో నటించబోయేది. ఇందులో ప్రశాంత్ సినిమా మీదే అంచనాలు ఎక్కువ ఉన్నాయి. ‘కేజీఎఫ్’ లాంటి సెన్సేషనల్ హిట్ తర్వాత ప్రశాంత్ తీయబోయే చిత్రమిది. హీరో ఎలివేషన్లలో కొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తున్న ప్రశాంత్.. ఎన్టీఆర్ లాంటి మాస్ హీరోను ఎలా ప్రెజెంట్ చేస్తాడనే విషయంలో అందరిలోనూ ప్రత్యేక ఆసక్తి ఉంది.ఐతే ఈ సినిమా ఓకే అయ్యే సమయానికి ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్‌ల మధ్య కథా చర్చలేమీ జరగలేదు. కథ కూడా వినకుండానే ప్రశాంత్ మీద నమ్మకంతో సినిమా ఓకే చేశాడు తారక్. ఐతే లాక్ డౌన్ వల్ల ఐదారు నెలలుగా ఖాళీగా ఉన్న ప్రశాంత్.. ఈ సమయాన్ని ఉపయోగించుకుని తారక్ సినిమా కోసం కథ రెడీ చేసేసినట్లు సమాచారం. పూర్తి స్క్రిప్టు అవ్వలేదు కానీ.. వన్ లైన్ ఆర్డర్ మాత్రం రెడీ అయిపోయిందట. ఇప్పటికే తారక్‌కు లైన్ కూడా చెప్పేశాడట తారక్. వీళ్లిద్దరి కలయికలో ప్రేక్షకులు ఎలాంటి సినిమాను ఆశిస్తారో అందుకు తగ్గ కథే తయారైనట్లు చెబుతున్నారు. ఇది ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్టైనర్ అంటున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. 2022 ఆరంభంలో ఈ సినిమా పట్టాలెక్కుతుందని అంచనా వేస్తున్నారు. త్రివిక్రమ్ సినిమాను పూర్తి చేశాకే తారక్ ఈ చిత్రంలోకి వెళ్తాడు.