వర్మ సినిమాకు ఎట్టకేలకు నో అబ్జెక్షన్ వచ్చింది

Mon Dec 10 2018 16:39:54 GMT+0530 (IST)

Story Behind Ratings of Unreleased Film Bhairava Geetha

వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిర్మించిన ‘భైరవగీత’ చిత్రం విడుదల వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చింది. ఎన్టీఆర్ మూవీ ‘అరవింద సమేత’ చిత్రంతో పాటే తన సినిమాను విడుదల చేస్తామంటూ చెప్పిన వర్మ అప్పటి నుండి ఇదిగో అదుగో అంటూ వాయిదాలు వేస్తూ వచ్చాడు. తాజాగా ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్రయత్నించగా సెన్సార్ బోర్డ్ సభ్యుల నుండి ఎదురు దెబ్బ తగిలింది. ఈ చిత్రంలో జంతువులను వినియోగించినందున సినిమాకు జంతు సంరక్షణ బోర్డు నుండి నో అబ్జక్షన్ సర్టిఫికెట్ తీసుకు రావాల్సి ఉంది. కాని చిత్ర యూనిట్ సభ్యులు సరైన సమయానికి తీసుకు రాలేక పోయారు. దాంతో సినిమా ఆలస్యం అయ్యింది.ఎట్టకేలకు జంతు సంరక్షణ బోర్డు నుండి నో అబ్జక్షన్ ను చిత్ర యూనిట్ సభ్యులు తీసుకు వచ్చారు. దాంతో ఈ చిత్రం ఈవారంలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కన్నడంలో రూపొందిన ఈ చిత్రంను వర్మ బ్రాండ్ తో తెలుగులో భారీగా పబ్లిసిటీ అయ్యింది. ప్రముఖ నిర్మాత అభిషేక్ పిక్చర్స్ లో ఈ చిత్రం విడుదల కాబోతుంది.

ధనుంజయ - ఐరా మోర్ జంటగా తెరకెక్కిన ఈ చిత్రం ‘ఆర్ ఎక్స్ 100’ చిత్రంను పోలి ఉందనే టాక్ వినిపిస్తుంది. ఈ చిత్రంపై కన్నడంలో కంటే తెలుగులోనే ఎక్కువ ఆసక్తి ఉందనిపిస్తోంది. విభిన్నమైన పల్లెటూరు కథాంశంతో ఈ చిత్రాన్ని దర్శకుడు సిద్దార్థ్ తెరకెక్కించాడు.