మహర్షి లో స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ!

Fri Aug 10 2018 12:45:21 GMT+0530 (IST)

Statue of Liberty in Mahesh babu Maharshi Movie TItle Logo

సూపర్ స్టార్ మహేష్ బాబు తాజా చిత్రం 'మహర్షి' ఫస్ట్ లుక్ - టీజర్ లు నిన్నే రిలీజ్ అయ్యాయి.  రెండిటికీ మంచి ఫీడ్ బ్యాక్ వచ్చింది.   ఇప్పటికే ఈ విషయంలో ఫ్యాన్స్ ఫుల్లుగా  ఖుష్ అయ్యారు.  మహేష్ బాబు కాలేజ్ స్టూడెంట్ లుక్ తో పాటు మహర్షి టైటిల్ పై - లోగో డిజైన్ పై సోషల్ మీడియా లో చర్చలు సాగుతున్నాయి.టైటిల్ లోగో డిజైన్ పై ఇప్పటికే ఫ్యాన్స్ దాదాపుగా రీసెర్చ్ చేస్తున్నారు.  'రీసెర్చ్' అని ఎందుకు పెద్ద పదం అంటారా. అలా చేయకపోతే లోగో లో ఉన్న అతి చిన్న డీటెయిల్స్ కనబడవు కదా.  టైటిల్ లోగో లో స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఉంది.. ఎక్కడ ఉందో గమనించారా మీరు?  టైటిల్ లో  'ర్షి' అక్షరంలో 'ష' వొత్తు పైనా చివరన పరిశీలనగా చూడండి.. మీకు స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కనబడుతుంది.

మరొకటి ఏంటంటే 'ర్షి' ని మీరు గమనిస్తే 'రిషి' అనే మహేష్ బాబు పాత్ర పేరు కనిపిస్తుంది. దానిక ముందున్న రెండు అక్షరాలూ 'మహ'.. సో ఇది హీరోయిన్ పూజా హెగ్డే పేరు అయి ఉండొచ్చని అంటున్నారు.  ఇక 'మహర్షి' టైటిల్ లోగో కింద బ్లాక్ & వైట్ నీడ లాగా ఎత్తైన భవంతులు కనిపిస్తాయి అంటే అది అమెరికా.  లోగో  పైనెమో కొబ్బరి చెట్లూ - పొలాలు కనిపిస్తాయి.. మన గ్రామాల్లో సాధారణంగా కనిపించే దృశ్యం అది.   మధ్యలో 'మహర్షి' టైటిల్ అంటే.. ఆ రెండిటికీ వారధి గా మహేష్ పాత్రను డిజైన్ చేశారన్నమాట.  ఇవన్నీ ఫ్యాన్స్ కనిపెట్టిన సంగతులు.  ఇంకా ఏవైనా బ్యాలన్సు ఉంటే మీరు చెప్పండి.. !