Begin typing your search above and press return to search.

షూటింగ్‌ విషయంలో స్టార్స్‌ అంతా ఒకే మాట

By:  Tupaki Desk   |   16 July 2020 4:30 AM GMT
షూటింగ్‌ విషయంలో స్టార్స్‌ అంతా ఒకే మాట
X
కరోనా కారణంగా మార్చి నుండి షూటింగ్స్‌ కు బ్రేక్‌ పడినది. లాక్‌ డౌన్‌ నుండి షూటింగ్స్‌ కు మినహాయింపు ఇవ్వాల్సిందిగా ప్రముఖులు పలువురు విజ్ఞప్తుల మీద విజ్ఞప్తులు చేశారు. సినీ కార్మికుల కోసం అయినా షూటింగ్స్‌ కు అనుమతులు ఇవ్వాలంటూ కోరిన వారు ఇప్పుడు షూటింగ్‌ అంటేనే భయపడుతున్నారు. షూటింగ్‌ ఏమో కాని అడుగు బయట పెట్టాలన్నా కూడా భయపడుతున్నారు. అంతగా కరోనా టాలీవుడ్‌ కోలీవుడ్‌ ఇలా అన్ని భాషల సినీ ప్రముఖులను ఆందోళనకు గురి చేస్తోంది.

బాలీవుడ్‌ బిగ్‌ బి అమితాబచ్చన్‌ ఇంకా ఆయన ఫ్యామిలీ కరోనా బారిన పడటంతో షూటింగ్‌ చేయాలన్న ఆలోచన ఉన్న వారు కూడా మానేశారు. చిన్న పెద్ద స్టార్స్‌ అంతా కూడా ఇప్పుడు షూటింగ్‌ కు వెళ్లే ఆలోచనను విరమించుకున్నారు. దేశంలోనే అత్యంత సంపన్నుల్లో ఒక్కడైన బిగ్‌ బి కరోనా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకునే ఉంటారు. అయినా కూడా ఆయన కరోనా బారిన పడటం చూస్తుంటే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా అడుగు బయట పెడితే ఖచ్చితంగా కరోనా ఎటాక్‌ అవుతుందనే ఆందోళన వ్యక్తం అవుతుంది.

జూన్‌ నుండి షూటింగ్స్‌ కు అనుమతులు వచ్చిన నేపథ్యంలో చాలా వరకు సినిమాలు జులై లేదా ఆగస్టులో షూటింగ్స్‌ ప్రారంభించాలని భావించారు. కాని ఈ ఏడాదిలో అసలు కెమెరా ముందుకు వెళ్ల కూడదని అసలు అడుగు బయట పెట్ట కూడదనే నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. చిన్న హీరోలు సైతం ఈ ఏడాది పూర్తిగా రెస్ట్‌ మూడ్‌ లోనే ఉన్నారట. మొత్తానికి స్టార్స్‌ నుండి చిన్న నటీనటుల వరకు అందరు కూడా షూటింగ్‌ అంటే వామ్మో అంటున్నారు.