పూజాహెగ్డే కి చెక్ పెట్టాలని చూస్తున్న స్టార్ హీరోయిన్...?

Tue Aug 11 2020 14:00:45 GMT+0530 (IST)

Star heroine looking to give a check to Pooja Hegde ...?

సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్స్ మధ్య ఈగోలు మనస్పర్థలు ఉంటాయనే విషయం తెలిసిందే. అందుకే ఎవరో ఒకరిద్దరు తప్పితే స్టార్ హీరోయిన్స్ లలో బెస్ట్ ఫ్రెండ్స్ పెద్దగా కనిపించరు. అయితే హీరోయిన్స్ లో నేపోటిజం కూడా ఉందని కొందరు కాస్టింగ్ వర్గాలు చెబుతున్నాయి. వివరాల్లోకి వెళితే ఇండస్ట్రీలో అడుగుపెట్టి కష్టపడి స్టార్ స్టేటస్ తెచ్చుకున్న హీరోయిన్స్ లలో సమంత ఒకరు. ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పుడు సామ్ ఎలా ఉన్నా.. ప్రస్తుతం హీరోయిన్స్ లో సమంత కి పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉంది. నాగ చైతన్యని వివాహం చేసుకొని అక్కినేని కోడలిగా అడుగుపెట్టిన సమంత కి.. ఇటు దగ్గుబాటి ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఉంది. ఈ నేపథ్యంలో సమంత ఇండస్ట్రీలో మరో హీరోయిన్ కి చెక్ పెట్టడానికి ట్రై చేస్తుందని ఫిలిం సర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.కాగా టాలీవుడ్ లో అక్కినేని సమంత - పూజా హెగ్డే మధ్య ఈగోలు ఉన్నట్లు ఇటీవల కొన్ని ఇన్సిడెంట్స్ వల్ల అర్థం అయింది. పూజా ఇంస్టాగ్రామ్ ఖాతాలో సమంత ఫోటోను జత చేస్తూ ''ఈమె నాకు పెద్దగా అందంగా కనిపించదు'' అంటూ కామెంట్ పెట్టింది. ఆ తర్వాత ఈ విషయాన్ని గ్రహించిన పూజా హెగ్డే తన అకౌంట్ హ్యాక్ అయినట్లు చెప్పుకొచ్చింది. అయినప్పటికీ ఇది మనసులో పెట్టుకున్న సామ్.. పూజాహెగ్డే కి టాలీవుడ్ లో చెక్ పెట్టాలని ప్రయత్నాలు చేస్తోందట. ఈ నేపథ్యంలో తన ఫ్యామిలీ హీరోలతో పాటు తనకు సన్నిహితంగా ఉండే ఇతర హీరోల దగ్గర తనకు పూజాకి మధ్య ఇటీవల జరిగిన ఆన్లైన్ డిస్కషన్స్ గురించి ప్రస్తావించి పూజ పై నెగటివ్ ప్రొపగాండా స్ప్రెడ్ చేస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. అంతేకాకుండా పూజా హెగ్డే వద్దకి వెళ్లే ఆఫర్స్ అన్నిటిని తన సన్నిహితురాలు రష్మిక మందన్న కు ఇవ్వాల్సిందిగా సమంత రికమెండ్ చేస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. ఇక సామ్ త్వరలోనే ఓ బైలింగ్వల్ సినిమాలో రష్మికతో కలిసి నటించనుందని సమాచారం.