Begin typing your search above and press return to search.

స్టార్ హీరోయిన్ డిజిటల్ ఎంట్రీ ఇంకెప్పుడు..??

By:  Tupaki Desk   |   16 Jun 2021 2:30 AM GMT
స్టార్ హీరోయిన్ డిజిటల్ ఎంట్రీ ఇంకెప్పుడు..??
X
సౌత్ టు నార్త్ సినీ ప్రేక్షకులకు హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్.. పరిచయం అవసరం లేదు. ఎందుకంటే సౌత్ లో దాదాపు అందరూ హీరోలతో సినిమాలు చేసేసింది అమ్మడు. ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళ, హిందీ సినిమాలు కూడా లైనప్ చేసి పెట్టేసింది. చేతినిండా సినిమాలతో ఇప్పట్లో ఖాళీ లేకుండా బిజీగా గడుపుతోంది. జయజానకినాయక సినిమా తర్వాత రకుల్ తెలుగులో హిట్టు అందుకోలేదు. కింగ్ నాగ్ తో మన్మధుడు-2 ప్లాప్ అయింది. అలాగే ఈ ఏడాది చెక్ సినిమాలో నటించింది. కానీ చెక్ కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టేసింది. ఇప్పటికైతే టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన గ్రామీణ నేపథ్యం కలిగిన మూవీ చేసింది.

ప్రస్తుతం రకుల్ హిట్టు కంపల్సరీ అనే పరిస్థితిలో ఉంది. అందుకే డైరెక్టర్ క్రిష్ సినిమా పై భారీ ఆశలే పెట్టుకుంది. అలాగే హిందీలో ఎటాక్, మేడే సినిమాలతో.. తమిళంలో పాన్ ఇండియా మూవీ ఇండియన్-2 తో పాటు టాలెంటెడ్ హీరో శివకార్తికేయన్ సరసన అయలన్ సినిమాలు చేస్తోంది. మొత్తానికి రకుల్ ప్రీత్ టైం ఫుల్ స్వింగ్ లో ఉందనే అనిపిస్తుంది. అయితే సినిమాల విషయం పక్కనపెడితే.. ప్రస్తుతం ప్రతీ ఒక్కరూ డిజిటల్ ప్లాట్ ఫాములు లేకపోతే ఏమైపోతారో అన్నట్లుగా మారిపోయారు. ఓటిటిల అవసరం.. ఉపయోగం అలా పెరగడంతో సినీ ప్రేమికులు అందరూ డిజిటల్ ప్లాట్ ఫామ్ లకు అలవాటు పడిపోయారు. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులలో ఓటీటీ తప్ప మరో ప్రత్యామ్నాయం సినిమా వాళ్లకు లేదనిపిస్తుంది.

ఈ క్రమంలో సినిమాలు చేసుకునే స్టార్ హీరోయిన్లు.. సీనియర్ ముద్దుగుమ్మలు అందరూ కూడా ఓటీటీలో వెబ్ సిరీస్ ల బాటపడుతున్నారు. ఇప్పటికే కాజల్.. సమంత.. తమన్నా.. త్రిష.. రాశిఖన్నా.. లాంటి బిజీ తారలు సైతం వెబ్ సీరీస్ లో నటిస్తున్నారు. కానీ రకుల్ ప్రీత్ సింగ్ మాత్రం ఇంకా వెబ్ సిరీస్ వైపు ఆలోచన లేదంటుందట. ఆల్రెడీ రకుల్ కూడా ఇండస్ట్రీలో అడుగుపెట్టి పదేళ్లు దాటింది. ప్రస్తుతం హీరోయిన్స్ అందరూ ఏదొక విధంగా నెగటివ్ రోల్స్ చేస్తూ ఓటిటిలో సక్సెస్ అందుకుంటున్నారు. వారి పెర్ఫార్మన్స్ చూసి అభినందిస్తుంది కానీ రకుల్ మాత్రం వెబ్ సిరీస్ వైపు వెళ్ళనంటుందని టాక్. ఆ విధంగానే ఆల్రెడీ కాస్టింగ్ ఏజెంట్లతో కూడా చెబుతుందట. వెబ్ సిరీస్ కాదు గాని ఒరిజినల్ ఓటిటి మూవీస్ చేసేందుకు రెడీ అన్నట్లుగా సిగ్నల్ ఇచ్చిందని ఇండస్ట్రీ వర్గాలు టాక్.