దేవి శ్రీ ప్రసాద్ ను రిజెక్ట్ చేసిన స్టార్ హీరో

Thu Jun 30 2022 09:00:01 GMT+0530 (IST)

Star hero rejected Devi Sri Prasad

మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ పుష్ప సినిమాతో మొత్తానికి పాన్ ఇండియా మ్యూజిక్ డైరెక్టర్ గా మంచి గుర్తింపు అందుకున్నాడు. కానీ చిన్న సినిమాలకు మాత్రం పూర్తిస్థాయిలో న్యాయం చేయలేక పోతున్నాడు. మొత్తంగా చూసుకుంటే సుకుమార్ కాంపౌండ్లోనే అద్భుతమైన మ్యూజిక్ ఇస్తాడు అని ఒక కామెంట్ కూడా ఉంది. దేవి శ్రీ ప్రసాద్ ను కథతోనే కరెక్ట్ గా మెప్పిస్తే మంచి మ్యూజిక్ ఇస్తాడు అని కూడా సుకుమార్ చెబుతూ ఉంటాడు.అయితే ఇటీవల ఒక స్టార్ హీరో మాత్రం దేవి శ్రీ ప్రసాద్ ట్యూన్స్ అన్ని రెడీ చేసిన తర్వాత ఏమాత్రం బాగోలేదు అని అతని ప్రాజెక్టు నుంచి తప్పించినట్లుగా తెలుస్తోంది. అతను మరెవరు కాదు.

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ అని బాలీవుడ్ మీడియాలో అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి. పుష్ప సినిమాతో బాలీవుడ్ ప్రేక్షకులను కూడా స్టెప్పులు వేయించిన దేవిశ్రీప్రసాద్

అంటే సల్మాన్ ఖాన్ కు ఎప్పటినుంచో మంచి అభిప్రాయం ఉంది. అతను కంపోజ్ చేసిన రింగ రింగ సాంగ్ ను కూడా తన రెడీ సినిమాలో సెట్ అయ్యేలా చేసుకున్నాడు.

బాలీవుడ్ లో ఒక సినిమాకు ఇద్దరు ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్లు వర్క్ చేసే ఆఫర్స్ దేవిశ్రీప్రసాద్ కూడా చాలానే వచ్చాయి. సల్మాన్ ఖాన్ కూడా మొదట తన సినిమాలకు ఒకటి లేదా రెండు పాటలను కంపోజ్ చేయమని కూడా ఆఫర్ ఇచ్చాడు.

కానీ ఎప్పుడూ కూడా దేవిశ్రీప్రసాద్ అలా సగం పనులు చేయలేను అని రిజెక్ట్ చేస్తూ వచ్చాడు. రీసెంట్ గా సల్మాన్ ఖాన్ కబీ ఈద్ కబీ దీవాలి అనే ఈ సినిమా కోసం దేవిశ్రీ ప్రసాద్ ను సెలెక్ట్ చేసుకోవాలి అని అనుకున్నాడట. అయితే చాలా ట్యూన్స్ రెడీ చేసి ఉంచిన దేవిశ్రీప్రసాద్ సల్మాన్ ఖాన్ మాత్రం మెప్పించలేకపోయాడట. దీంతో కొన్నిసార్లు చర్చల అనంతరం అతని అవసరం లేదని చెప్పడంతో నిర్మాతలు కూడా మొహం మీద చెప్పినట్లుగా తెలుస్తోంది. అంతే కాకుండా సల్మాన్ ఖాన్ KGF మ్యూజిక్ డైరెక్టర్ రవి బసృర్ ని సెలెక్ట్ చేసుకునే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది.