'నగ్నం' బ్యూటీ కోసం స్టార్ డైరెక్టర్ ప్రయత్నాలు...?

Sun Jul 12 2020 16:40:11 GMT+0530 (IST)

Star director's efforts for 'naked' beauty ...?

సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ రూపొందించిన 'నగ్నం' సినిమాతో ఓవర్ నైట్ పాపులర్ అయిన బ్యూటీ స్వీటీ అలియాస్ శ్రీ రాపాక. 'నగ్నం' సినిమాలో మొహమాటం లేకుండా వర్మకి నచ్చినట్లు చెప్పినట్లు నటించి అందరి దృష్టిని ఆకర్షించింది స్వీటీ. వర్మ ఎన్ని డిఫెరెంట్ యాంగిల్స్ లో కెమెరా పెట్టినా కోపరేట్ చేసిన స్వీటీ ఒక్క సినిమాతోనే అందాల ఆరబోతలో నాకెవరు పోటీలేరని నిరూపించింది. నిజానికి శ్రీ రాపాక 'నగ్నం' సినిమాలో నటించకముందే ఇండస్ట్రీలో వర్క్ చేసింది. టాలీవుడ్ లో కాస్ట్యూమ్ డిజైనర్ గా ఎంతో మంది స్టార్ హీరోలతో కలసి వర్క్ చేసినట్టు ఈ మధ్య పలు ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చింది. అంతేకాకుండా ఇండస్ట్రీలోని హీరోల బిహేవియర్ గురించి వెల్లడించింది. ఇక నందమూరి బాలకృష్ణతో సహా పలువురు హీరోలు తనతో ప్రవర్తించిన విధానాన్ని కూడా వివరించింది. ఈ క్రమంలో అమ్మడు ఓ పాపులర్ రియాలిటీ షోలో కూడా కనిపించబోతోందని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి.ఇండియాలో బుల్లితెరపై సూపర్ సక్సెస్ అయిన రియాలిటీ షో లలో 'బిగ్ బాస్' ఒకటి. ఎన్నో వివాదాల నడుమ తెలుగులో కూడా ప్రసారం అయిన ఈ షోకు ఫస్ట్ సీజన్ నుంచే భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. ఈ షోలో పాల్గొనే కంటెస్టెంట్స్ కి కూడా గుర్తింపు దక్కుతూ వస్తోంది. అందుకే 'బిగ్ బాస్' లో పాల్గొనే అవకాశం వస్తే హౌస్ లోకి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇప్పటికే మూడు సీజన్లు పూర్తి చేసుకున్న 'బిగ్ బాస్' ఇప్పుడు సీజన్ 4 కి సిద్ధం అవుతోంది. ఈ నేపథ్యంలో సీజన్ 4 కోసం మరింత గ్లామర్ యాడ్ చేయాలని యాజమాన్యం ఇప్పటికే పలువురు సెలబ్రిటీలతో సంప్రదింపులు జరుపుతున్నారట. ఈ క్రమంలో బిగ్ బాస్ 4లోకి శ్రీ రాపాక ని తీసుకోమని రామ్ గోపాల్ వర్మ సదరు షో నిర్వాహకులకు రికమెండ్ చేస్తున్నారట.

ఆర్జీవీ తన సినిమాల ద్వారా ఎంతో మంది న్యూ టాలెంట్ ని ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఇప్పుడు శ్రీ రాపాకకి కూడా క్రేజ్ ఏర్పడేలా చేయాలని వర్మ ప్రయత్నాలు చేస్తున్నారట. ఈ క్రమంలోనే గత కొన్ని రోజులుగా 'నగ్నం' బ్యూటీ బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టబోతోందనే వార్తలు ఉపందుకున్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. మరి స్వీటీ బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టి బిగ్ బాస్ కి చమటలు పట్టిస్తుందేమో చూడాలి.