Begin typing your search above and press return to search.

పవన్ కళ్యాణ్ సినిమాలో 'ఫిల్మ్ మేకర్'గా స్టార్ డైరెక్టర్!

By:  Tupaki Desk   |   24 Jun 2021 5:30 AM GMT
పవన్ కళ్యాణ్ సినిమాలో ఫిల్మ్ మేకర్గా స్టార్ డైరెక్టర్!
X
తెలుగు ఇండస్ట్రీలో రీమేక్స్ ట్రెండ్ బాగానే నడుస్తుంది. ఈ మధ్యకాలంలో తెలుగు సినిమాలు వేరే భాషలోకి.. వేరే భాషలోని సినిమాలు తెలుగులోకి రీమేక్ అవుతూనే ఉన్నాయి. ఇదివరకు ఎంతమంచి సినిమా అయినా నేరుగా డబ్బింగ్ చేసి రిలీజ్ చేసేవారు. కానీ ఇప్పుడు సినిమా హిట్ అయిందంటే చాలు. వెంటనే డబ్బింగ్ అనే ఆలోచన పక్కనపెట్టి రీమేక్ అనే నిర్ణయం తీసుకుంటున్నారు. ఆ వెంటనే స్క్రిప్ట్ పనులు మొదలు పెట్టేస్తున్నారు. ప్రస్తుతం మలయాళం నుండి చాలా సినిమాలు తెలుగులో రీమేక్ అవుతున్నాయి. అందులో ఒకటి బ్లాక్ బస్టర్ అయ్యప్పనుమ్ కోషియం.

గతేడాది ప్రారంభంలో విడుదలై సూపర్ హిట్ అందుకున్న ఏకే సినిమాను తెలుగులో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ వారు రీమేక్ చేస్తున్నారు. టాలీవుడ్ స్టార్స్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - దగ్గుబాటి రానా ప్రధాన పాత్రలలో ఈ సినిమా తెరకెక్కుతోంది. పవన్ కళ్యాణ్ - రానా కాంబినేషన్ లో రాబోతున్న మొదటి సినిమా ఇది. పవన్ కళ్యాణ్ పోలీస్ అధికారిగా కనిపించనుండగా.. రానా మిల్ట్రీ రిటైర్డ్ హవాల్దారుగా కనిపించబోతున్నాడు. వీరిద్దరి మధ్య ఇగోల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ భారీ యాక్షన్ మూవీలో పవన్ - రానా ఇద్దరూ కూడా హోరాహోరిగా తలపడనున్నారు.

ప్రస్తుతం సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమా గురించి రోజుకో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాజాగా ఈ సినిమాలో డైరెక్టర్ వివి వినాయక్ ఓ క్యారెక్టర్ పోషిస్తున్నట్లు వార్తలొచ్చాయి. అయితే ఈ వార్తలపై స్పందించిన వినాయక్.. అవును నిజమే. పవన్ సినిమాలో నేను కూడా ఓ పాత్ర పోషిస్తున్నాను. అదికూడా ఓ ఫిల్మ్ మేకర్ గానే కనిపిస్తాను అంటూ చెప్పినట్లు సమాచారం. మరి ఈ లెక్కన రీమేక్ సినిమాలో భారీ తారాగణం కనిపించే సరికి సినిమా పై అంచనాలు రెట్టింపు అవుతున్నాయి. ఈ సినిమాను సాగర్ చంద్ర తెరకెక్కిస్తుండగా.. తమన్ సంగీతం అందిస్తున్నాడు.