హీరో విజయ్ పై స్టార్ విలన్ సంచలన వ్యాఖ్యలు!!

Sat Jul 04 2020 20:00:10 GMT+0530 (IST)

Star Villain Nepolian Sensational Comments On Hero Vijay

సినీ ఇండస్ట్రీలో కొందరిని చూస్తే విలనిజం వీరిని చూసే పుట్టిందిరా.. అనిపిస్తుంది. అలాంటి వారు వారి నటన లో.. వారి డైలాగ్ డెలివరీ లో.. ముఖం లో పలికించే హావభావాలు.. ముఖ్యంగా విలన్ పాత్రకు కావాల్సిన ఫిజిక్. ఇలా అన్నీ కలిపి పర్ఫెక్ట్ విలన్.. అని అతను పండించేది విలనిజం అని ప్రేక్షకులు నమ్మి ఆదరిస్తారు. నిన్నటితరం మేటి విలన్లలో స్టార్డం అందుకున్న నటుడు నెపోలియన్. అప్పట్లో విలనిజంలో ప్రత్యేకతను ప్రదర్శించిన నెపోలియన్.. వెండితెర మీద ఓ వెలుగు వెలిగాడని చెప్పాలి. సౌత్ ఇండస్ట్రీల అన్నింటిలో సినిమాలు చేసి టాలెంట్ ప్రూవ్ చేసుకున్న ఆయన ముంబై నుండి నటులు రావడంతో కాస్త విలనిజం తగ్గించి క్యారెక్టర్ రోల్స్ వేయడం ప్రారంభించారు. అయితే ఆయన తాజాగా ఇండస్ట్రీలో జరుగుతున్న కొన్ని లోగుట్టులను బహిర్గతం చేస్తూ వార్తల్లో నిలిచారు.తమిళ ఇండస్ట్రీలో అందరు స్టార్లతో నటించిన నెపోలియన్.. కేవలం స్టార్ హీరో అజిత్ తో ఇంతవరకు నటించలేకపోయారు. అవకాశం వస్తే ఇప్పటికైనా చేయడానికి సిద్దంగానే ఉన్నారు. కానీ విలన్ పాత్రలో కాదు. ఏ పాత్ర అయినా ఓకే అంటున్నారు. ఇదిలా ఉండగా.. తను  ఇక పై ఇళయదళపతి విజయ్ తో కలసి నటించే ఆలోచన లేదని తేల్చిచెప్పేసారు. ఎందుకంటే దానికి కూడా కారణం ఉందట. నిజానికి పోకిరి సినిమా షూటింగ్ టైం లో విజయ్ నెపోలియన్ లకు ఓ చిన్న వాగ్వాదం జరిగిందట. ఆ సంఘటన గుర్తు చేసుకొని.. అప్పటి నుండి విజయ్ సినిమాలు చూడటం మానేశా అన్నారు. మరి విజయ్ నటన గురించి మాట్లాడమంటే.. చెప్ప లేను. కానీ పోకిరి సినిమా లో విజయ్ డాన్స్.. యాక్టింగ్ ఇరగ దీశాడని చెప్పుకొచ్చారు. ఇక పై నన్ను ఫేమస్ చేసిన విలన్ పాత్ర ల వైపు వెళ్లనని స్పష్టం చేశారు ఈ సీనియర్ విలన్. ప్రస్తుతం నెపోలియన్ మాటలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.