Begin typing your search above and press return to search.

స్టార్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ ప్రేమ నిజమేనట!

By:  Tupaki Desk   |   15 May 2020 7:50 AM GMT
స్టార్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ ప్రేమ నిజమేనట!
X
మలయాళ సంగీత దర్శకుడు గోపీ సుందర్‌ పేరు ఈమద్య కాలంలో టాలీవుడ్‌ లో కూడా ప్రముఖంగా వినిపిస్తుంది. ఈయన టాలీవుడ్‌ లో మెల్ల మెల్లగా స్టార్‌ హీరోల సినిమాలకు సంగీతం అందించే స్థాయికి ఎదిగాడు. మలయాళంతో పాటు తెలుగులో కూడా బిజీగా ఉన్న ఈ సంగీత దర్శకుడు కుటుంబ విషయాలతో మీడియాలో చర్చనీయాంశం అయ్యాడు.

కొన్నాళ్ల క్రితం ప్రియ అనే ఆమెను వివాహం చేసుకున్న గోపీ సుందర్‌ ఇద్దరు కొడుకులు పుట్టిన తర్వాత ఆమెతో విభేదాల కారణంగా విడిపోయేందుకు సిద్దం అయ్యాడు. ఇద్దరి ఒప్పందంతో విడాకులు తీసుకోబోతున్నారు. ప్రస్తుతం ఫ్యామిలీ కోర్టులో వీరి వివాహంకు సంబంధించిన కేసు నడుస్తోంది. ఈ సమయంలోనే ఈయన ఒక గాయినితో ప్రేమలో ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఆమెను పెళ్లి చేసుకునేందుకు కూడా రెడీ అవుతున్నట్లుగా మలయాళ మీడియాలో ప్రముఖంగా వార్తలు వస్తున్నాయి.

తాజాగా గోపీ సుందర్‌ ఈ విషయమై స్పందించాడు. తన భార్యకు విడాకులు ఇస్తున్న మాట నిజమే. కోర్టులో ప్రస్తుతం మా విడాకుల కేసు నడుస్తుంది. త్వరలోనే విడాకులు వస్తాయని ఆశిస్తున్నాను అన్నాడు. అలాగే ప్రస్తుతం తాను ప్రేమలో ఉన్నాను అని మళ్లీ పెళ్లి చేసుకుంటాను అంటూ క్లారిటీ ఇచ్చాడు. అయితే ప్రస్తుతానికి విడాకుల కేసు నడుస్తున్న కారణంగా రెండవ పెళ్లి విషయమై ఎలాంటి ప్రకటన చేయలేను అంటూ ఆయన సన్నిహితులతో అంటున్నాడట.