వివాదాల వెనుక నిజాలేంటి బాస్ ?

Tue Jul 16 2019 12:46:47 GMT+0530 (IST)

ఇంకో ఐదు రోజుల్లో బిగ్ బాస్ 3 ప్రారంభం కాబోతోంది. నాగార్జున హోస్ట్ చేస్తున్న మూడో సీజన్ మీద అభిమానులు చాలా అంచనాలు పెట్టుకున్నారు. అయితే సరిగ్గా ఈ సమయంలో షోకు సంబంధించి క్యాస్టింగ్ కౌచ్ వివాదం బయటికి రావడం ఇప్పుడు టీవీ ఇండస్ట్రీలో సెగలు రేపుతోంది. ఇద్దరు అప్ కమింగ్ లేడీ ఆర్టిస్టులు ఏకంగా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం సంచలనం రేపింది. స్టార్ మా నుంచి దీనికి సంబంధించి ఎలాంటి ఖండన కానీ వివరణ కానీ ఇంకా రాలేదు.నాగ్ కూడా దీనికి సంబంధించిన క్లారిటీ వచ్చాకే ప్రెస్ మీట్ లాంటివి పెట్టమని చెప్పాడట. ఇది లీగల్ గా నిలుస్తుందా లేదా అనేది పక్కన పెడితే శనివారం నాటి ఫస్ట్ ఎపిసోడ్ షూటింగ్ కి టెలికాస్ట్ కి అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయని సమాచారం. బిగ్ బాస్ అంటేనే కాంట్రోవర్సి అనే తరహాలో ప్రతి బాషలో ఈ రియాలిటీ షో మీద చాలా వివాదాలు జరుగుతూనే ఉన్నాయి. హిందిలో సల్మాన్ ఖాన్ పదకొండు సీజన్లు చేసినా గొడవలు కేసులు లేకుండా ఏదీ పూర్తి కాలేదు. కాని అదే విపరీతమైన పాపులారిటీ తెచ్చి పెట్టింది.

కమల్ హాసన్ నడిపిన తమిళ షోలో కూడా బాగానే రచ్చ జరిగింది. ఎటొచ్చి తెలుగులోనే ఈ మసాలా తక్కువయ్యిందనే కామెంట్స్  విన్పిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు క్యాస్టింగ్ కౌచ్ సెగలు షోని ఎంతవరకు ప్రభావితం చేస్తాయనేది వేచి చూడాలి. ఆగిపోయే సీన్ లేదు కాని సదరు నటీమణులు చేసిన ఆరోపణలకు ఆధారాలు ఉంటె తప్ప చట్టపరంగా కూడా ఎవరైనా ఏమి చేయలేని పరిస్థితి. మరి ఫస్ట్ ఎపిసోడ్ కన్నా ముందే రచ్చ చేస్తున్న బిగ్ బాస్ 3 స్టార్ట్ అయ్యాక ఇంకేమేం చేస్తాడో వేచి చూడాలి