ట్రెండీ స్టోరి: నటవారసురాళ్లు గ్రాండ్ మస్తీకి రెడీ

Tue Jan 18 2022 15:01:14 GMT+0530 (IST)

Star Kids erupting before entry

అతిలోక సుందరి శ్రీదేవి నటవారసురాలిగా ఎంట్రీ ఇచ్చిన జాన్వీకపూర్ బాలీవుడ్ లో ఇప్పుడిప్పుడే నిలదొక్కుకుంటోంది. అలాగే  సైఫ్ అలీఖాన్ డాటర్ గా ఎంట్రీ ఇచ్చిన సారా అలీఖాన్ కూడా అదే  వేవ్ లోకి కెరీర్ ని బిల్డ్ చేసుకుని ముందుకు వెళ్తోంది. చుంకీ పాండే వారసురాలు అనన్య పాండే ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా లైగర్ తో పరిచయమైపోతోంది. అతి  త్వరలోనే మరికొంత మంది స్టార్ కిడ్స్ బాలీవుడ్ లో లాంచ్ అవ్వడానికి రెడీ అవుతున్నారు. ఇందులో నిర్మాతలు హీరో హీరోయిన్ల వారసురాళ్లు ఉన్నారు.  నైసా దేవగణ్..సుహానా ఖాన్...షానాయ కపూర్.. ఖుషీ కపూర్.. ఇరా ఖాన్.. నవ్య నవేలి నందా లాంటి అందమైన భామా మణులు బాలీవుడ్ తెరను మరింత రంగుల మయం చేయడానికి రంగం సిద్దం చేస్తున్నారు.సోషల్ మీడియాల్లో ఈ భామలకి మంచి క్రేజ్ ఉంది. ఇన్ స్టా ఖాతాల్లో లక్షలాదిగా ఫాలోవర్స్  ఉన్నారు .ఈ భామల ఎంట్రీ బాలీవుడ్ లో ఏ క్షణమైనా జరగొచ్చిన బాలీవుడ్ మీడియాలో కథనాలు వేడెక్కిస్తున్నాయి. ఓ సారి ఆ వివరాల్లోకి వెళ్తే....

అమితాబచ్చన్ మనవరాలిగా బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతోంది నవ్యా నవేలి నంద. లండన్ లోని సెవెన్ వోక్స్ లో స్కూలింగ్ పూర్తిచేసింది ఈ బ్యూటీ. అటుపై డిజిటల్ టెక్నాలజీ..యూక్స్ డిజైన్ లో 2020లో ఫోర్డ్ హోమ్ యూనివర్శిటీ నుంచి డిగ్రీ సంపాదించింది. బాలీవుడ్ లో సినిమాలు చేయాలన్నది ఈ బ్యూటీ చిన్న నాటి కల. ఆ కలను నెరవేర్చుకునే దిశగా అడుగులు వేస్తోంది. షారుక్ ఖాన్ -గౌరీఖాన్ గారాల పట్టి సుహానా ఖాన్ ఎంట్రీ చాలా కాలంగా ఉంటుందని ప్రచారం సాగుతుంది. కానీ ఇప్పటివరకూ  అది జరగలేదు. ఆ సమయం అసన్నమైందని... సుహానా మొదటి సినిమా షారూక్ రెడ్ చిల్లీస్ ఎంటర్ టైన్ మెంట్స్ లోనే నిర్మించాలని.. ఆ సినిమా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఉండాలని ప్లాన్ చేస్తున్నారు.

సుహానా ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్లో చదివింది. తర్వాత న్యూయార్క్ యూనివర్శిటీలో టిస్బ్ స్కూల్ ఆఫ్ ఆర్స్ట్ లో చదువుకుంది. ఇక శ్రీదేవి చిన్న కుమార్తె ఖుషీ కపూర్  ఎంట్రీ కూడా రేపోమాపో అన్నట్లే ఉంది. తల్లిని.. సోదరిని స్ఫూర్తిగా తీసుకుని సినిమాల్లోకి రావాలని ఆశపడుతోంది. ఖుషీ కూడా ధీరుబాయ్ స్కూల్లో స్టడీస్ పూర్తి చేసింది. ఆ తర్వాత న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో జాయిన్ అయింది. ఇక అమీర్ ఖాన్ కుమార్తె ఇరా ఖాన్ ఇప్పటికే నెట్టింట బాగా పాపులర్ అయింది. బోయ్ ఫ్రెండ్ నూపుర్ శిఖరేతో క్లోజ్ గా ఉన్న ఫోటోలు చాలాసార్లు వైరల్ గా మారాయి.

తరచూ సోషల్ మీడియాలో అభిమానులకు బాగా టచ్ లో ఉంటుంది. ఈ బ్యూటీకూడా బాలీవుడ్ ప్రయత్నాలు మొదలు పెట్టిందనేది గుసగుస. అయితే కెమెరా వెనక దర్శకురాలిగా నిరూపించుకున్నాకే నటిగానూ నటించే వీలుందని తెలుస్తోంది. సంజయ్ కపూర్-మహిప్ కపూర్ కుమార్తె షానాయ కపూర్. ఈ హాట్ యంగ్ బ్యూటీ అందానికి ఫిదా అవ్వాల్సిందే. ఇప్పటికే మోడలింగ్ లోకి ఎంట్రీ ఇచ్చేసింది. బాలీవుడ్ ప్రయత్నాల్లో ఉన్నట్లు సమాచారం. అజయ్ దేవగణ్-కాజోల్ అగర్వాల్ కుమార్తె  నైసా దేగణ్ కూడా హిందీ సినిమాలపై మక్కువతోనే ఉంది. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున  ఫాలోయింగ్ కలిగిన సెలబ్రిటీ కిడ్స్ జాబితాలో నైనా పేరు ఉంది.