స్టార్ కిడ్స్ మధ్యలో పోటీ అలా ఉందట!

Sun Jan 20 2019 20:27:49 GMT+0530 (IST)

Star Kids Janhvi Kapoor Vs Sara Ali Khan

ఈ ప్రపంచమే పోటీమయం. మనం మనకు ఎంత గొప్ప అని సర్ది చెపుకున్నా పక్కింటిపిన్నిగారు మాత్రం మనకంటే పది రెట్లు ఎక్కువ సంపాదించే ఒక జఫ్ఫాగాడి పేరు చెప్పి మనకు లేని బీపీ షుగర్లను చిటికెలో తెప్పిస్తారు.  అందరి కొంపల్లో ఇదే తంతు. అందుకే సంపాదన చెప్పదానికి ఈమధ్య చాలామంది భయపడి ఛస్తున్నారు!ఈ పోటీ ఇక్కడే కాదు బాలీవుడ్ స్టార్ కిడ్స్ మధ్య కూడా ఉంది.  లాస్ట్ ఇయర్ ఇద్దరు స్టార్ కిడ్స్ హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చారు. వారిలో ఒకరు శ్రీదేవి-బోనీ కపూర్ ల ముద్దుల కూతురు జాన్వి ఒకరైతే.. సైఫ్ అలీ ఖాన్ గారాలపట్టి సారా అలీ ఖాన్.  జాన్వి పై జనాలు... మీడియా చాలా ఎక్కువగా ఫోకస్ చేశారు గానీ మొదటి సినిమా సాధారణ విజయమే సాధించింది. నటన లుక్స్ కు కూడా యావరేజ్ మార్కులే పడ్డాయి. కానీ సారా మొదటి సినిమా 'కేదార్ నాథ్' రిలీజ్ విషయంలో ఇబ్బందులు ఎదురైనా రిలీజ్ తర్వాత హిట్ గా నిలించింది.  సారా కు నటన.. లుక్స్ పరంగా మంచి మార్కులు ఇచ్చారు నెటిజనులు.   ఇక అంతటితో ఆగకుండా సారా సెకండ్ ఫిలిం 'సింబా' సూపర్ డూపర్ హిట్ అయింది. దీంతో జాన్వితో పోటీలో ముందుకెళ్ళింది.  

సోషల్ మీడియాలో చర్చల్లో ఈ విషయం క్లియర్ గా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఫ్యాన్స్ మా హీరోయిన్ గొప్ప అంటే.. కాదు కాదు మా హీరోయిన్ గొప్ప అంటూ ఉంటారు కదా.  ఈ విషయం జాన్వి నాన్నగారు బోని కపూర్ కు తెలిసి జాన్విని హ్యాండిల్ చేసే పీఆర్ ఏజెన్సీకి మీరేం పీకుతున్నారంటూ క్లాస్ పీకాడట.  రాబోయే రోజుల్లో ఈ పోటీ ఇంకా ఎక్కువ అవుతుందని అంటున్నారు. ఏంటో ఈ పోటీలు.. మనకే కాదు సెలబ్రిటీలకు కూడా తప్పడం లేదు.