ఆమెను చూసి స్టార్ హీరోలు అసూయ

Thu Nov 21 2019 15:08:44 GMT+0530 (IST)

Star Heros Getting Jelous About Her

బాలీవుడ్ హీరోయిన్స్ తో పోల్చితే సౌత్ హీరోయిన్స్ కు చాలా అన్యాయం జరుగుతుందని.. అక్కడి హీరోయిన్స్ పారితోషికం విషయంలో దూసుకు పోతుంటే సౌత్ హీరోయిన్స్ మాత్రం చాలా వివక్ష ఎదుర్కొంటున్నారు అంటూ గత కొన్నాళ్లుగా సౌత్ హీరోయిన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్న విషయం తెల్సిందే. సౌత్ హీరోయిన్స్ కు రెండు కోట్లు ఇస్తే చాలా ఎక్కువ అన్నట్లుగా అనుకునే వారు. ఇప్పటికి కూడా పరిస్థితి అలాగే ఉందని అంటున్నారు. కాని ఒక్క నయనతార విషయంలో మాత్రం పరిస్థితి వేరేగా ఉంది.నయనతార హీరోయిన్ గా తమిళంలో వరుసగా చిత్రాలు చేస్తోంది. తెలుగులో కూడా అడపాదడపా చిత్రాలు చేస్తూ వస్తోంది. ఈమె ఎక్కువగా లేడీ ఓరియంటెడ్ చిత్రాలు చేస్తుంది. ఆ సినిమాలు నాలుగు నుండి అయిదు కోట్ల వరకు పారితోషికంను ఈ అమ్మడు తీసుకుందని వార్తలు వచ్చాయి. గత రెండేళ్లుగా భారీగా ఈమె నటించిన సినిమాలు వసూళ్లు రాబడుతున్నాయి. దానికి తోడు ఈమె వెంట పడుతున్న నిర్మాతల క్యూ చాలా పెద్దగా ఉంది. అందుకే మళ్లీ పారితోషికం పెంచేసింది.

కథను బట్టి కష్టాన్ని బట్టి 7 నుండి 8 కోట్ల వరకు ఈమె పారితోషికంను డిమాండ్ చేస్తుందట. అయినా కూడా నిర్మాతలు ఏమాత్రం వెనుకంజ వేయకుండా ఆమెతో సినిమాలకు క్యూ కడుతూనే ఉన్నారు. స్టార్ హీరోల సినిమాల్లో ఈమె ఇంత పారితోషికం తీసుకుని నటిస్తుందా లేదంటే కేవలం హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రాలకే ఈ పారితోషికమా అనేది తెలియాల్సి ఉంది. నయనతార పారితోషికం చూసి స్టార్ హీరోలు కూడా అసూయ పడుతున్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. తమిళంలో స్టార్ హీరోలుగా చెలామని అవుతున్న హీరోల పారితోషికాలు నయన్ పారితోషికం కంటే తక్కువే. అందుకే వారు నయన్ ను చూసి కుళ్లుకుంటూ ఉంటారు.