స్టార్ హీరోయిన్స్ సాదారణ హీరోయిన్స్ అంతా కాస్టింగ్ కౌచ్ బాధితులే !

Sun Aug 02 2020 19:00:56 GMT+0530 (IST)

Star Heroines Ordinary Heroines are all casting couch victims

టాలీవుడ్ లో ఎంతో మంది స్టార్ హీరోలకు అమ్మగా హీరోయిన్స్ కు కూడా అమ్మగా నటించిన క్యారెక్టర్ ఆర్టిస్టు ప్రగతి ఈమద్య కాలంలో సినిమాల్లో కంటే సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపిస్తోంది. షూటింగ్స్ లేని కారణంగా పూర్తి సమయంను సోషల్ మీడియాలో ఈమె పెట్టినట్లుంది. మాస్ డాన్స్ లు హాట్ వర్కౌట్ వీడియోలు ఫొటోలను సోషల్ మీడియాలో ఈమె షేర్ చేస్తూ ఉంది. ఈమద్య కాలంలో సోషల్ మీడియాలో రెగ్యులర్ గా ట్రెండ్ అవుతూనే ఉన్న ప్రగతి ఒక యూట్యూబ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ ద్వారా మళ్లీ చర్చనీయాంశంగా మారింది.ఆ ఇంటర్వ్యూలు పలు ఆసక్తికర విషయాలను వెళ్లడి చేసిన ప్రగతి ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ లేదంటే మాత్రం నేను నమ్మను అంది. ఖచ్చితంగా టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ ఉంది. స్టార్ హీరోయిన్స్ కాస్టింగ్ కౌచ్ లేదంటారు. మాకు అలాంటిది ఏమీ ఎదురు కాలేదు అంటారు. సాదారణ హీరోయిన్స్ మాత్రం చాలా మంది నీచులు ఉన్నారని అంటారు. అయితే ప్రగతి మాత్రం ఆ ఇద్దరి కేసుల్లో కూడా కాస్టింగ్ కౌచ్ ఎదురై ఉండవచ్చు అంటూ అభిప్రాయం వ్యక్తం చేసింది.

ఏ ఒక్కరు కూడా ఒక్క అమ్మాయి కోసం సినిమాను తీయరు. కోట్లు పెట్టి అమ్మాయిలపై ఆసక్తితో సినిమాలు చేసే రోజులు పోయాయి. ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్పను కాని భయంకరంగా ఉందని మాత్రం చెప్పను అంది. తనకు అలాంటి అనుభవం ఎదురైతే అక్కడ నుండి సైలెంట్ గా బయట పడతాను. ఆ సినిమా ఛాన్స్ ను వదిలేస్తానంటూ ప్రగతి చెప్పుకొచ్చింది. మొత్తానికి అయితే ఈమె ఉద్దేశ్యం ప్రకారం కాస్టింగ్ కౌచ్ ఉంది కాని అమ్మాయిల పట్ల నీచంగా ప్రవర్తించే వారు మాత్రం తక్కువగానే ఉన్నారట.