స్టార్ హీరోయిన్ ఓటీటీ సిరీస్ మిడిల్ డ్రాప్

Sat Nov 27 2021 13:00:01 GMT+0530 (IST)

Star Heroine OTT Series Middle Drop

ఏదైనా ఒక ప్రాజెక్ట్ ప్రారంభమై మధ్యలో విభేధాల వల్ల ఆగిపోతే అది బిగ్ డిబేట్ కి కారణమవుతుంది. ఇంతకుముందు శివగామి సిరీస్ ని ఓటీటీ కోసం నిర్మించినా కంటెంట్ బాలేదని మిడిల్ డ్రాపవ్వడం సంచలనమైంది. ఇప్పుడు అదే తీరుగా బాలీవుడ్ అందాల కథానాయిక సోనాక్షి నటించిన ఓ సిరీస్ మిడిల్ డ్రాప్ అవ్వడం చర్చకు వచ్చింది. ఈ సంవత్సరం ప్రారంభంలో స్ట్రీమింగ్ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రలో `బుల్బుల్ తరంగ్` అనే చిత్రాన్ని ప్రకటించింది.అయితే రకరకాల కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ పూర్తిగా ఆగిపోయిందని గుసగుస వినిపిస్తోంది. సోనాక్షి కొంత కాలం క్రితం ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు సమాచారం. ఈ వార్తలను సోనాక్షి కానీ నిర్మాతలు కానీ మీడియాకు వెల్లడించలేదు. సోనాక్షి నిష్క్రమణ తర్వాత నెట్ ఫ్లిక్స్ ప్రాజెక్ట్ ను ఎందుకు వదులుకుందో క్లారిటీ రాలేదు.అలాగే సోనాక్షి స్థానంలో వేరొకరిని ఎంపిక చేసారా లేదా కూడా తెలీదు. 

నెట్ ఫ్లిక్స్ ఈ చిత్రాన్ని నిలిపివేయడానికి ఇతర బలమైన కారణాలు ఏవైనా ఉన్నాయా? అన్నది వెల్లడి కావాల్సి ఉంది. బుల్బుల్ తరంగ్ బలమైన సందేశంతో కూడిన సోషల్ డ్రామా. శ్రీ నారాయణ్ సింగ్ దర్శకత్వం వహించిన బుల్బుల్ తరంగ్ లో తాహిర్ రాజ్ భాసిన్ కథానాయకుడిగా నటించారు. ఈ సినిమాలో రాజ్ బబ్బర్- సుస్మిత ముఖర్జీ కీలక పాత్రలు పోషించాల్సి ఉంది.

సోనాక్షి ప్రస్తుతం తదుపరి సినిమాలపై దృష్టి సారించింది. ముదస్సర్ అజీజ్ దర్శకత్వంలో తన రాబోయే చిత్రం డబుల్ ఎక్స్ ఎల్ పనుల్లో బిజీగా ఉంది. ఇందులో హుమా ఖురేషి మరో ప్రధాన పాత్రలో నటిస్తోంది. ఇతర వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.