చిన్న హీరో సినిమా యాక్సెప్ట్ చేశానని బాధపడుతున్న స్టార్ హీరోయిన్...?

Tue Aug 04 2020 13:40:27 GMT+0530 (IST)

The star heroine who is upset that has accepted small hero movie ...?

ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోయిన్ హోదాలో కొనసాగుతున్న ఓ బ్యూటీ చిన్న హీరో సినిమాకి సైన్ చేసి తప్పుచేశానని తెగ ఫీల్ అవుతోందట. టాలీవుడ్ లో స్టార్ హీరోల సరసన నటించిన ఈ అమ్మడు తక్కువ కాలంలోనే క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. అందంతో పాటు అభినయం కూడా కలబోసిన ఈ భామ టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ బాలీవుడ్ సినిమాల్లో కూడా అవకాశాలు అందిపుచ్చుకుంటోంది. స్టార్ హీరోల సరసన నటించేందుకు ఏకైక ఛాయిస్ గా మారిన అమ్మడు డేట్స్ కోసం హీరోలు సైతం వెయిట్ చేసే రేంజ్ కి వెళ్ళింది. అయితే ఓ వైపు పాన్ ఇండియా ప్రాజెక్ట్ లో నటిస్తూనే.. ఇండస్ట్రీలో నిలదొక్కుకోడానికి ట్రై చేస్తున్న హీరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.కాగా టాలీవుడ్ లో స్టార్ హీరోగా మారే క్వాలిటీస్ ఉన్న ఆ హీరో.. సినిమా కోసం ఎంత కష్టపడినా లక్ మాత్రం కలిసి రావడం లేదు. ఈ నేపథ్యంలో హిట్ కొట్టాలన్న కసితో ఇండస్ట్రీలోని స్టార్ ప్రొడ్యూసర్ బ్యానర్ లో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీతో ఆ హీరోకి ఎలాగైనా హిట్ అందించాలనుకున్న సదరు ప్రొడక్షన్ హౌస్ స్టార్ హీరోయిన్ ని అతనికి జోడీగా సెట్ చేసింది. దీని కోసం అమ్మడికి భారీగానే ముట్టజెప్పారని సమాచారం. ఫస్ట్ లుక్ తో మంచి బజ్ క్రియేట్ చేసుకున్న ఈ మూవీ హీరోకి ఉపయోగపడినా తనకు ఏ మాత్రం క్రేజ్ తెచ్చిపెట్టదని సదరు స్టార్ హీరోయిన్ ఇప్పుడు తన సన్నిహితుల దగ్గర చెప్పుకొని బాధ పడుతోందట. ప్రస్తుతం చేతినిండా ప్రాజెక్ట్స్ చేతిలో పెట్టుకొని చిన్న హీరో సినిమా ఎలా అంగీకరించానా అని తెగ ఫీల్ అవుతోందట. అయితే కొన్ని సినిమాలు రెమ్యూనరేషన్ కోసం కూడా చేయాల్సి వస్తుందని.. ఈ మూవీ కూడా అలాంటిదే అనుకొని సరిపెట్టుకోమని ఆమె శ్రేయోభిలాషులు అమ్మడిని ఓదారుస్తున్నారట.