Begin typing your search above and press return to search.

చిక్కుల్లో స్టార్ హీరో భూములు

By:  Tupaki Desk   |   23 Oct 2021 3:30 AM GMT
చిక్కుల్లో స్టార్ హీరో భూములు
X
ఓ టాలీవుడ్ స్టార్ హీరో భూములు ఇప్పుడు చిక్కుల్లో ప‌డ్డాయి. త‌న త‌రం హీరోలంతా ప‌క్కా విల్లాలు.. చిన్న చిన్న వ్యాపారాల‌పై మాత్ర‌మే పెట్టుబ‌డి పెడితే ఈ స్టార్ హీరో మాత్రం హైద‌రాబాద్ చుట్టు ప‌క్క‌ల్లో వున్న భూములు కొన‌డంపై దృష్టిసారించాడు. త‌న ద‌గ్గ‌రికి వ‌చ్చిన ప్ర‌తీ భూమినీ కొనడం మొద‌లుపెట్టాడు. దీంతో కోట్ల ఆస్తుల‌కు అధిప‌తిగా మారాడు. అయితే ప్ర‌స్తుతం ప‌రిస్థితి మారింది. తాజాగా ఆయ‌న కొనుగోలు చేసిన భూముల్లో చాలా వ‌ర‌కు చిక్కుల్లో ప‌డ్డాయి.

గ‌తంలో ఈ హీరో కొంత ఆందోళ‌న‌కు గుర‌య్యారు. అక్ర‌మ ఆక్ర‌మ‌ణ‌ల కార‌ణంగా అప్ప‌ట్లో అధికార పార్టీ వ‌ర్గాల వ‌ల్ల స‌ద‌రు హీరో ఇబ్బందులు ఎదుర్కొన్నారు కూడా. ఆ త‌రువాత వారిని త‌ప్పుదోవ ప‌ట్టించి త‌న అక్రమ ఆక్ర‌మ‌ణ స‌క్ర‌మ‌మంటూ మేనేజ్ చేశారు. ప్ర‌భుత్వానికి అండ‌గా మాట్లాడ‌టం మొద‌లుపెట్టారు. దీంతో స‌ద‌రు హీరో అక్ర‌మ క‌ట్ట‌డాన్ని ప్ర‌భుత్వం స‌క్ర‌మ‌మే అని త‌రువాత చెప్పాల్సి వ‌చ్చింది.

అయితే ఈ వివాదం స‌ద్దుమ‌నిగిన త‌రువాత స‌ద‌రు హీరో తన భూములను కొంత మంది ప‌వ‌ర్‌ ఫుల్ వ్య‌క్తుల‌కు చ‌ట్ట‌విరుద్ధంగా విక్ర‌యించ‌డం జ‌రిగిందట‌. తాజాగా విష‌యం వెలుగులోకి రావ‌డంతో స్టార్ హీరో విక్ర‌యించిన భూములు ప్ర‌స్తుతం చిక్కుల్లో ప‌డ్డాయ‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ చిక్కుల్లోంచి బ‌య‌ట‌ప‌డ‌టం కోసం స‌ద‌రు హీరో త‌న‌కు అత్యంత స‌న్నిహితంగా వుండే వారిని క్ర‌మం త‌ప్ప‌కుండా సంప్ర‌దిస్తున్నార‌ట‌.

ఇదిలా వుంటే వివాదాస్ప‌ద భూముల్ని హీరో వ‌దులుకుంటేనే మంచిద‌ని కొంత మంది అంటున్నారు. వేల కోట్ల ఆస్తులున్న హీరో వివాదాస్ప‌ద భూముల‌పై క‌న్నేయ‌డం ఏమీ బాగాలేద‌ని మ‌రి కొంత మంది పెద‌వి విరుస్తున్నారు. ఇదిలా వుంటే ఎట్టిప‌రిస్థితుల్లోనూ త‌ను కొనుగోలు చేసిన వివాదాస్ప‌ద భూమిని వ‌దులు కోకూడ‌ద‌ని స‌ద‌రు హీరో విశ్వ‌ప్ర‌య‌త్నాలే చేస్తున్నార‌ట‌. దీని కోసం తాను ఎంత వ‌ర‌కైనా వెళ‌తాన‌ని.. చివ‌రి నిమిషం వ‌ర‌కు పోరాడుతాన‌ని స్ప‌ష్టం చేస్తున్నార‌ట‌.