పుట్టింటోళ్లను తలచి భర్తను మరిచిన స్టార్ వైఫ్ పై ఫ్యాన్స్ ఫైరింగ్!

Thu Jul 29 2021 16:15:09 GMT+0530 (IST)

Star Hero Wife who gave credit to her own Family

బాలీవుడ్ లో షాహిద్ కపూర్ స్టార్ డమ్ గురించి తెలిసిందే. ఉత్తరాదిన భారీ ఫాలోయింగ్ ఉన్న స్టార్ అతడు. అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్ బ్లాక్ బస్టర్ అయ్యాక షాహిద్ క్రేజ్ అమాంతం పెరిగింది. వరుసగా భారీ ప్రాజెక్ట్ లు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. వీటన్నింటికి మించి షాహిద్..కి కపూర్ వంశస్తుడిగా గొప్ప ఎలివేషన్ ఉంది. అప్పట్లో కరీనా కపూర్ తో షాహిద్ లవ్వాయణం అతడి పాపులారిటీని లైవ్ లో ఉంచిన సంగతి తెలిసినదే. ఇక కాలక్రమంలో షాహిద్ దిల్లీకి చెందిన రాధాస్వామి సత్సంగ్ ఫ్యామిలీ నుంచి మీరా రాజ్ పుత్ తో సంబంధం కుదుర్చుకుని పెళ్లాడారు.ప్రస్తుతం ఈ జంట అన్యోన్య దాంపత్యం అభిమానుల్లో నిరంతరం చర్చకు వస్తుంది. షాహిద్ భార్య మీరా రాజ్ పుత్ సినిమాలతో బిజీ అవుతున్నారని ఇటీవల ప్రచారమైంది. అలాగే షాహిద్ తో కలిసి మీరా పలు కమర్షియల్ ప్రకటనల్లో నటించడం వల్లనే ఈ ప్రాచారం అని తెలుస్తోంది. తాజాగా మీరా రాజుపుత్ ప్రఖ్యాత ఆయుర్వేద ఔషధానికి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవరిస్తోన్న యాడ్ ఓ షాపింగ్ మాల్ లో లైవ్ అవుతోంది. ఆ పక్కనే మీరా ప్రమోషనల్ ఫోటో కూడా బిగ్ ఎల్.ఈ.డీ స్క్రీన్ లో కనిపిస్తోంది. అదే సమయంలో షాపింగ్ మాల్ లో ఉన్న మీరా తల్లిదండ్రులు అది చూసి ఎంతో సంబరపడ్డారు. తమ కుమార్తె స్టార్ డమ్ కి మురిసిపోయారట.

ఈ విషయం మీరాకు తెలియడంతో సోషల్ మీడియా వేదికగా ఆ సంతోషాన్ని అభిమానులతో పంచుకుంది. ఇదంతా కేవలం తన తల్లిదండ్రుల వల్లనేనని.. స్టార్ గా నిలబడ్డానంటే అమ్మానాన్నల కృషి ఫలితమేనని.. మీరు నా తల్లిదండ్రులు అయినందుకు ఎంతో గర్వంగా ఉందంటూ ఓ పోస్ట్ పెట్టింది. అంతా బాగానే ఉంది కానీ.. తన భర్తను మరవడంతో షాహిద్ అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మీ ఎదుగుదలలో భర్త కృషి లేదా? అంటే ప్రశ్నిస్తున్నారు. బాలీవుడ్ లో ఈ రోజు బిజీగా ఉన్నావంటే కారణం షాహిద్ అని ఓ వర్గం గట్టిగా వాధిస్తోంది. దీంతో ఆ వ్యాఖ్యల్ని కూడా సమర్ధిస్తూ చివరిగా ఫీల్ గుడ్ ఎండిగ్ తో పోస్ట్ ని ముగించింది.