యూరప్ లో చిక్కుకున్న స్టార్ హీరో..!

Wed Apr 01 2020 17:40:16 GMT+0530 (IST)

Star Hero Trapped In Europe

షూటింగ్ ల కోసం విదేశాలకు వెళ్లిన స్టార్ హీరో ఇప్పుడే అక్కడే ఇరుక్కుపోయిన వైనం వెలుగుచూసింది. యూరప్ లోని జోర్డన్ లో స్టార్ హీరో ఇరుక్కుపోయాడు. కరోనా భయంతో ఇప్పుడు భయం భయంగా గడుపుతున్న పరిస్థితి నెలకొంది.కరోనా మహమ్మారితో దేశంలో లాక్ డౌన్ విధించక ముందే కొన్ని రోజుల క్రితం మలయాళ స్టార్ హీరో పృథ్వీ రాజ్ తోపాటు అతని కొత్త చిత్రం బృందం యూరప్ లోని జోర్డాన్ దేశానికి కొత్త చిత్రం షూటింగ్ కోసం వెళ్లింది. కరోనా తో బంద్ అవుతుందని తెలియక అక్కడే ఉండిపోయారు.

కరోనాతో యూరప్ అంతా లాక్ డౌన్ ప్రకటించడంతో యూనిట్ షెడ్యూల్ ను రద్దు చేశారు. భారతదేశానికి తిరిగి రావాలని చూస్తున్నారు. అయితే లాక్ డౌన్ కారణంగా వారు తిరిగి రావడం లేదు..

నివేదికల ప్రకారం జోర్డాన్‌లో 58 మంది సభ్యుల బృందం చిక్కుకున్నట్టు తెలిసింది. దర్శకుడు బ్లెస్సీ భారత ప్రభుత్వం.. కేరళ ఫిల్మ్ ఛాంబర్ అసోసియేషన్ కు తమను భారత్ కు తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు.