Begin typing your search above and press return to search.

హీరోకు ప్రమాదం.. చేతికి ప్యాక్చర్‌

By:  Tupaki Desk   |   27 May 2020 7:00 AM GMT
హీరోకు ప్రమాదం.. చేతికి ప్యాక్చర్‌
X
తమిళ స్టార్‌ హీరో సూర్య జిమ్‌ లో వర్కౌట్స్‌ చేస్తుండగా చేతికి గాయం అయ్యిందట. వెయిట్‌ లిఫ్టింగ్‌ చేస్తున్న సమయంలో చేయి ప్యాక్చర్‌ అయ్యిందట. వెంటనే హాస్పిటల్‌ కు వెళ్లినట్లుగా తమిళ మీడియాలో కథనాలు వస్తున్నాయి. చిన్న ప్యాక్చర్‌ అవ్వడంతో వెంటనే సూర్య హాస్పిటల్‌ నుండి డిశ్చార్జ్‌ అయినట్లుగా తెలుస్తోంది. సూర్య ప్రమాదం విషయంలో అధికారికంగా ఎలాంటి క్లారిటీ లేదు. కాని తమిళ మీడియాలో మాత్రం ప్రముఖంగా వార్తలు వస్తున్నాయి.

గత కొన్ని వారాలుగా ఇంటికే పరిమితం అయ్యి ఉంటున్న సూర్య ఇంట్లోనే వర్కౌట్స్‌ చేస్తున్నాడు. ఆయన నిన్న ఉదయం వర్కౌట్స్‌ చేస్తున్న సమయంలో పొరపాటున స్లిప్‌ అయ్యి ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. షూటింగ్స్‌ ప్రారంభం అయిన వెంటనే ఆకాశమే నీ హద్దురా సినిమాను పూర్తి చేసి విడుదల చేయాలనుకున్నాడు. ఇదే సమయంలో హరి దర్శకత్వంలో కూడా ఒక సినిమాను చేసేందుకు సిద్దం అవుతున్నాడు.

హీరోగా నిర్మాతగా వరుసగా సినిమాలు చేస్తున్న సూర్య గురించిన ఈ విషయం ప్రస్తుతం అభిమానులకు ఆందోళన కలిగిస్తుంది. ఈ విషయంలో సూర్య ఫ్యామిలీ నుండి క్లారిటీ ఇవ్వాలంటూ ఫ్యాన్స్‌ విజ్ఞప్తి చేస్తున్నారు. సూర్యకు ఏమైనా ప్రమాదం నిజంగానే జరిగితే వెంటనే కోలుకోవాలని ఫ్యాన్స్‌ ప్రార్ధిస్తున్నారు.